IT Hiring: భారత ఐటీ సేవల రంగంపై చాలా మంది యువత ప్రస్తుతం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ రంగంలోని కంపెనీలు త్వరగా తిరిగి పుంజుకోవాలని కోరుకుంటున్నారు. కొత్త ఉద్యోగ నియమాకాలు మళ్లీ ప్రారంభం కావాలని భావిస్తున్నారు. అయితే తాజా డేటా మాత్రం షాకింగ్ వివరాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
ఐటీ సేవల రంగంలోని ప్రధాన కంపెనీలైన కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ ఉద్యోగుల నియామకాలను భారీగా తగ్గించేశాయి. రెగ్యులేటరీ ఫైలింగ్స్ డేటా ప్రకారం సదరు కంపెనీలు నియమించబడిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 2022తో పోలిస్తే 2023లో ప్రపంచవ్యాప్తంగా 1,51,607 తగ్గింది. ఇక్కడ గమనించాల్సిన కీలక విషయం ఏమిటంటే.. రెండు కంపెనీల ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారతదేశంలోనే పనిచేస్తున్నారు. అంటే ఈ వార్త నేరుగా భారతీయ టెక్కీలపై ప్రభావాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. రెండు కంపెనీలు సంయుక్తంగా ఇండియాలో 4 లక్షల మంది టెక్కీలను నియమించుకుంటాయి.

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ 2022లో మెుత్తంగా 1,32,000 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇదే క్రమంలో ఫ్రెంచ్ ఐటీ కన్సల్టెన్సీ సంస్థ క్యాప్‌జెమినీ మొత్తం 1,40,789 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. ఇదే విధంగా 2023లో కంపెనీల రిక్రూట్మెంట్ సరళిని గమనిస్తే.. కాగ్నిజెంట్ కేవలం 60,000 మందిని నియమించుకోగా.. క్యాప్‌జెమినీ 61,182 మంది టెక్కీలను మాత్రమే నియమించుకుంది. రెండు కంపెనీలు సంయుక్తంగా 1,51,607 మందిని అంతకు ముందు ఏడాది కంటే తక్కువగా నియమించుకున్నాయి. FY24 మార్చి త్రైమాసికంలో కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య 7,100 తగ్గి 344,400కి పడిపోయింది
ఇక ఇదే క్రమంలో భారతీయ ఐటీ సేవల కంపెనీలను పరిశీలిస్తే.. టాప్ టెక్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మార్చితో ముగిసిన కాలానికి 2022 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే సుమారు 70,000 మంది టెక్కీలను తక్కువగా నియమించుకున్నాయని వెల్లడైంది. వాస్తవానికి కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు అవసరమైన స్థాయిల కంటే ఎక్కువగా టెక్కీలను నియమించుకున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ ఎవరెస్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ బెండోర్-శామ్యూల్ తెలిపారు. ఆ సమయంలో ఐటీ కంపెనీల వ్యాపారంలో నెలకొన్న బూమ్ కొనసాగుతుందని వారి భ్రమించారని అన్నారు. ప్రస్తుతం ఐటీ సేవల రంగం వ్యాపారం కుదింపుకు గురికావటంతో అధిక స్థాయిలో టాలెంట్ సప్లై కొనసాగుతోందని అన్నారు.
2023లో కాగ్నిజెంట్ ఉద్యోగులను ఇళ్లకు పంపిచేందుకు పరిహారం రూపంలో 115 మిలియన్ డాలర్లను వెచ్చింది. అలాగే ఫెసిలిటీలను రద్దు చేసుకున్నందుకు 114 మిలియన్ డాలర్లను వెచ్చించినట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో టెక్ కంపెనీలు జనరేటివ్ ఏఐ వినియోగం వల్ల కంపెనీలు ఫ్రెషర్ల లేదా లెవెల్ 1 ఉద్యోగులను తక్కువగా నియమించుకునేలా చేసింది. దీనికి తోడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితులు కంపెనీలను తమ టెక్ ఖర్చులను తగ్గించుకునేలా చేయటంతో చాలా కంపెనీలు పెద్ద ప్రాజెక్టులు లేక తగ్గిన ఆదాయాలు, మార్జిన్ ప్రెజర్ ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications