IT News: విప్రోను వీడిన మరో పెద్ద తలకాయ్.. టెక్ దిగ్గజానికి వరుస షాక్స్, ఆందోళనలో టెక్కీలు

Wipro News: దేశంలోని టాప్ టెక్ దిగ్గజాల్లో ఒకటైన విప్రోను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కంపెనీ నుంచి వరుసగా అగ్రనాయకత్వానికి చెందిన వ్యక్తులు రాజీనామాలు చేయటం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగుల్లో సైతం ఇది మనో స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది.

తాజాగా మే 17న ఐటీ దిగ్గజం విప్రో తన చీఫ్ ఆపరోటింగ్ ఆఫీసర్ అమిత్ చౌదరి రాజీనామా చేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో సీఓఓ చౌదరి కంపెనీ బయట అవకాశాలను కొనసాగించేందుకు తక్షణమే వైదొలిగినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. చౌదరి కంపెనీని మే 31న వీడతారని చెప్పిన కంపెనీ ఆయన స్థానంలో బాధ్యతలను సంజీవ్ జైన్ బెంగళూరు నుంచే చూసుకుంటారని వెల్లడించింది.

IT Jaint Wipro appoints Sanjeev jain as new COO amid Amit Chowdary resigns from top position

మే 10న కంపెనీ ఆసియా పసిఫిక్, ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా(APMEA) ప్రెసిడెంట్ అనిస్ చెంచా రాజీనామా చేసిన తర్వాత.. విప్రో నుంచి తాజాగా చౌదరి వెళ్లిపోవటం రెండవ పెద్ద నిష్క్రమణ. మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థియరీ డెలాపోర్టే ఏప్రిల్ 6న రాజీనామా చేసిన తర్వాత రెండు పెద్ద రాజీనామాలు వచ్చాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చౌదరి, అనిస్ చెంచా, డెలాపోర్టే అందరూ ఫ్రాన్స్ ప్రధాన కార్యాలయంగా వ్యాపారం నిర్వహిస్తున్న క్యాప్‌జెమినీలో పనిచేశారు. డెలాపోర్టే విప్రో సీఈఓగా ఉన్నప్పుడు చెంచా, చౌదరి ఇద్దరూ విప్రోలో చేరారు.

తాజా సమాచారం ప్రకారం సంజీవ్ జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పల్లియాకు రిపోర్ట్ చేస్తారని, విప్రో ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతారని విప్రో తన స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్‌లో తెలిపింది. దీనికి ముందు జైన్ 2023లో ఐటీ సంస్థలో వ్యాపార కార్యకలాపాల గ్లోబల్ హెడ్‌గా చేరారు. పెద్ద, విభిన్న బృందాలకు నాయకత్వం వహించడంలో, ప్రపంచ కార్యకలాపాలను పెంచడంలో ఆయనకు దాదాపు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. సంస్థలో చేరినప్పటి నుంచి జైన్ విప్రో గిగ్ వర్క్ ప్లాట్‌ఫారమ్ టాప్‌గేర్‌తో పాటు టాలెంట్ స్కిలింగ్, గ్లోబల్ మొబిలిటీ, టాలెంట్ అక్విజిషన్, బిజినెస్ రెసిలెన్స్ ఫంక్షన్‌లతో సహా విప్రో టాలెంట్ సప్లై చెయిన్‌కు నాయకత్వం వహిస్తున్నారు.

విప్రో AI శిక్షణ, అప్‌స్కిల్లింగ్ వ్యూహం అభివృద్ధి, విస్తరణలో జైన్ కీలక నాయకత్వ పాత్ర పోషించారని కంపెనీ వెల్లడించింది. అయితే ప్రస్తుతం జైన్ తన కొత్త పాత్రలో గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీస్ అండ్ ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్‌ను పర్యవేక్షిస్తారని కంపెనీ తెలిపింది. విప్రోలో చేరటానికి ముందు జైన్ కిండ్రిల్ హోల్డింగ్స్, కాగ్నిజెంట్, జీఈ వంటి సంస్థల్లో పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. పైగా ఆయన IIM-ముంబై పూర్వ విద్యార్థి కూడా.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+