For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TCS: విప్రో తర్వాత రంగంలోకి దిగిన TCS.. 6 లక్షల టెక్కీలకు షాక్.. ఆ నిర్ణయంలో వెనక్కి తగ్గనంటోన్న టెక్ దిగ్గజం.

|

TCS: కంపెనీ ఎదుగుదల గురించి మాత్రమే కాకుండా తమ ఉద్యోగుల గురించి సైతం ఆలోచిస్తుంది. టాటా గ్రూప్ ఈ సారి కంపెనీని గాడిలో పెట్టేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. విప్రో మాటవినని ఉద్యోగులను తొలగించిన తరువాతి రోజే కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఈ విషయం వెనుక ఉన్న మర్మమేంటో ఇప్పుడు తెలుకుందాం..

25 బిలియన్ డాలర్ల కంపెనీ..

25 బిలియన్ డాలర్ల కంపెనీ..

టాటా గ్రూప్ వ్యాపారంలో టీసీఎస్ కంపెనీది చాలా కీలక భాగం. కరోనా తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగి చేరుకోవటంతో కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లను ఆఫీసు నుంచి పనిచేయిస్తోంది. కస్టమర్‌లు సైతం కంపెనీ కార్యాలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ప్రయత్నాలు మెుదలు పెట్టింది.

హైబ్రిడ్ వర్క్ మోడల్‌..

హైబ్రిడ్ వర్క్ మోడల్‌..

2025 నాటికి హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అమలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. అయితే దీనికి ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడిన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించి కరోనా ముందు నాటి పరిస్థితులను తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇకపై ఉద్యోగులు వారంలో 3 రోజుల పాటు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాట మర్చిపోమని తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. ఇతర ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగుల నియామకం సమయంలోనే NO Work from Home అని చెప్పేస్తున్నాయి.

మేనేజర్లను సంప్రదించాలని..

మేనేజర్లను సంప్రదించాలని..

రిటర్న్-టు-ఆఫీస్ ప్లాన్‌ కింద ఉద్యోగులు ఆఫీసుకు తిరిగి రావడానికి సంబంధించి ప్రాజెక్ట్‌ల కోసం చేసిన ఏర్పాట్లను తెలుసుకోవటం కోసం వెంటనే తమ మేనేజర్‌లను సంప్రదించాలని TCS వెల్లడించింది. ప్రాజెక్ట్ అవసరాల ఆధారంగా రోస్టరింగ్ చేయబడుతుందని తెలిపింది. ఫ్రెషర్లు, అనుభవజ్ఞులైన నిపుణుల కలయిక ఉంటుందని TCS ప్రతినిధి తెలిపారు.

25/25 మోడల్ అమలు..

25/25 మోడల్ అమలు..

కంపెనీ 25/25 మోడల్ ప్రకారం .. 25 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఒకేసారి ఆఫీసుల నుంచి పని చేయవలసిన అవసరం లేదు. వారు తమ సమయాన్ని 25 శాతానికి మించి ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఏ ప్రాజెక్ట్‌లోనైనా 25 శాతం కంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండరాదని TCS తెలిపింది. అయితే దీనిని అమలు చేయటానికి ముందు ఆఫీసులు వచ్చే ఉద్యోగుల సంఖ్యను 80 శాతానికి పెంచాలన్నది కంపెనీ లక్ష్యం.

6 లక్షల ఉద్యోగులు..

6 లక్షల ఉద్యోగులు..

TCSకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600,000 మంది ఉద్యోగులు ఉన్నారు. FY23 మొదటి త్రైమాసికంలో ఉద్యోగుల అట్రిషన్ రేటు 19.7 శాతంగా ఉంది. ఇది ఆరు త్రైమాసికాల్లో అత్యధికం. మొదటి త్రైమాసికంలో 14,000 మందిని నియమించుకుంది. అంతకు ముందు సంవత్సరం ఈ సంఖ్య 24,000గా ఉంది.

Read more about: tcs it news business news
English summary

TCS: విప్రో తర్వాత రంగంలోకి దిగిన TCS.. 6 లక్షల టెక్కీలకు షాక్.. ఆ నిర్ణయంలో వెనక్కి తగ్గనంటోన్న టెక్ దిగ్గజం. | it jaint tcs ordered its employees to work from office atleast 3 days in a week shocking techies

tcs ordered its employees to work from office atleast 3 days in a week shocking techies
Story first published: Friday, September 23, 2022, 11:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X