Anna Konidela: అన్నా కొణిదెలకు వందల కోట్ల ఆస్తులు.. విదేశాల్లో వ్యాపారాలు..!

జనసేన అధినేత, పవన్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల విడాకులు తీసుకుంటున్నట్లు సంయుక్తంగా ప్రకటించారు. వారి ప్రకటన రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. . సోమవారం రాత్రి ఈ ప్రకటన వెలువడటంతో సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ దారితీసింది. కాగా తమ వైవాహిక బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల పేర్కొన్నారు. తమ పిల్లల బాధ్యతను తల్లిదండ్రులుగా ఇద్దరూ కలిసి నిర్వర్తిస్తామని ప్రకటించారు. పిల్లల సంతోషం, భవిష్యత్తు, శ్రేయస్సు తమకు ఎప్పటికీ అత్యంత ప్రాధాన్యమన్నారు. ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, తమపై సానుభూతితో వ్యవహరించాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.

అన్నా లెజ్నెవా 1980లో రష్యాలో జన్మించారు. మోడల్ మరియు నటి అయిన ఆమె, 2011లో 'తీన్ మార్' చిత్ర షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్‌ను కలిశారు. వీరి పరిచయం ప్రేమగా మారి, రెండేళ్ల డేటింగ్ తర్వాత 2013 సెప్టెంబర్ 30న వివాహం చేసుకున్నారు. అన్నా లెజ్నెవా పవన్ కళ్యాణ్‌కు మూడవ భార్య. కాగా అన్నా కొణిదెలకు భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. మోడలింగ్ కెరీర్‌తో పాటు, అన్నా లెజ్నెవాకు సింగపూర్‌లో హోటల్ చైన్‌లు ఉన్నాయని, రష్యా, సింగపూర్‌లలో దాదాపు రూ.1800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని సమాచారం. వీటితో పాటు హైదరాబాద్ లో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

Anna Konidela

పవన్, అన్నాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పిల్లల భవిష్యత్తు, సంతోషం తమ ఉమ్మడి బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు.
పవన్ కల్యాణ్ గతంలో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. 1997లో నందినిని వివాహం పెళ్లి చేసుకున్నారు. 2008లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2009లో నటి రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. 2012లో వీరి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2013లో అన్నా లెజినోవాను లగ్గం చేసుకున్నారు. పవన్ కల్యాణ్, అనా కొణిదెల విడిపోవడానికి గల కారణాలను సంయుక్త ప్రకటనలో పేర్కొనలేదు. వ్యక్తిగత విషయాలపై ఎలాంటి వివరాలు కూడా అందులో ప్రస్తావించలేదు.

అయితే వీరి విడాకులకు సంబంధించి గతంలో వేణు స్వామి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో అయిన పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా దంపతుల విడాకులు తీసుకుంటారని ఆయన చెప్పారు. పవన్ విడాకులు, నాలుగో పెళ్లిపై మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెండేళ్ల క్రితం ఒక ఛానెల్ లో మాట్లాడుతూ పవన్ 2026లో విడాకులు తీసుకుంటారని పేర్కొన్నారు. మీరెలా చెబుతున్నారని.. అని జర్నలిస్టు ప్రశ్నించగా జ్యోతిష్యం ఆధారంగా చెబుతున్నానని వివరించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+