Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..!
పుత్తడి ధర గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తోంది. తాజాగా బంగారం ధర మరోసారి పెరిగింది. ఒక నెలలో పుత్తడి ధర 8 శాతం, వెండి ధర 7 శాతం పెరిగింది. ఈరోజు (మార్చి 15) బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. బంగారం ధర 100 రూపాయలకు పైగా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.66000 దాటింది. వెండి కూడా రూ.315 పెరిగి కిలో ధర రూ.75550కి చేరింది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 6,061 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.6,612 గా ఉంది.
ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6061 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.6612గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,120 గా ఉంది. కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.60,610, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 66,120గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,360 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,940 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60,760 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,270గా ఉంది. ఇక తెలుగురాష్ట్రాల్లో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,000 దాటింది. హైదరాబాద్ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,150 గా ఉన్నట్లు తెలిసింది. విజయవాడ, కరీంనగర్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,200 ఉన్నట్లు చెబుతున్నారు.
సాధారణంగా బంగారం 24 క్యారెట్ల రూపంలో ఉంటుంది. అంటే.. ఇది కేవలం బంగారం బిస్కెట్ మాత్రమే. ఇందులో ఎలాంటి లోహం కలవదు. అయితే 22 క్యారెట్ల బంగారంలో రాగి కలుస్తుంది. అందుకే దీన్ని 22 క్యారెట్ల బంగారం అంటారు. ఆభరణాలన్నీ 22 క్యారెట్ల నాణ్యతతోనే ఉంటాయి.


Click it and Unblock the Notifications