Bengaluru News: బెంగళూరు, ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఇక రాదా..!
కేఎస్ఆర్ బెంగళూరు, సీఎస్ఎంటీ ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ నడుపుతామని రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ సర్వీస్ పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఆగస్టు నాటికి ప్రారంభించాలన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవడమే కాకుండా ఈ రైలును నడపడానికి అవసరమైన రైలు (రేక్) బెంగళూరు నుంచి తరలించబడుతుండటంతో, సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) వద్ద ప్రస్తుతం సిద్ధంగా ఉన్న రైలు ఏదీ లేదని సమాచారం. ఈ ప్రధాన రైలు వారానికి ఆరు రోజులు, రెండు దిశలలో రాత్రిపూట నడపాలని ప్రతిపాదించినందున, దీని నిర్వహణకు రెండు రైలు రేక్స్ అవసరమవుతాయి.
ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)తో జాయింట్ వెంచర్‌లో భాగంగా బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ (PSU) అయిన 'భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్' (BEML) తయారు చేస్తోంది. ఇప్పటివరకు రైల్వేలకు ఆరు రేక్స్ అందజేసింది. వాటిలో రెండు ఇప్పటికే హౌరా-కామాఖ్య జంక్షన్ సర్వీస్‌లో వినియోగంలో ఉన్నాయి. బెంగళూరు-ముంబై మార్గానికి రెండు రేక్స్, నార్తర్న్ రైల్వే (NR) జోన్‌కు రెండు రేక్ల్ కేటాయించాలని రైల్వే బోర్డు మొదట జూలైలో ప్రణాళిక వేసింది. అయితే బోర్డు ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుని, SWR (బెంగళూరు)కు కేటాయించిన ఒక రేక్ ను NR జోన్ పరిధిలోని షకూర్ బస్తీ రైల్వే స్టేషన్‌కు తరలించాలని నిర్ణయించింది.

ఈ చర్యతో బెంగళూరు వద్ద సిద్ధంగా ఉన్న రైళ్లు లేకుండా పోయాయి. అలాగే కేటాయించిన రెండవ రేక్ ఇంకా అందాల్సి ఉంది. కాగా, మిగిలిన రెండు రేక్స్ రైల్వే శాఖ ఇంకా ఎవరికీ కేటాయించలేదు.
బెంగళూరులో ఉన్న రేక్ ను ధర్మవరం, రాయచూర్, బల్హార్షా, పల్వాల్ మీదుగా ఢిల్లీకి "ప్రాధాన్యత ప్రాతిపదికన" తరలించాలని రైల్వే బోర్డు SWRను ఆదేశించిందని గత వారం సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ సేవ ఆగస్టు నుంచి ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏప్రిల్‌లో ప్రకటించారు. అయితే, రేక్స్ కేటాయింపులో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నందున, సెప్టెంబర్ చివరి నాటికి తప్ప ఈ ట్రైన్ ప్రారంభం కాకపోవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించినప్పటికీ, భారతదేశపు సాంకేతిక, ఆర్థిక రాజధానుల మధ్య సూపర్ ఫాస్ట్ అనుసంధానం కోసం మూడు దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం బెంగళూరు, ముంబైల మధ్య రెండు ప్రత్యక్ష రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. అందులో 'ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్' మాత్రమే ప్రతిరోజూ నడిచే రైలు. సెప్టెంబర్ 2025లో బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ రెండు నగరాల మధ్య సూపర్ ఫాస్ట్ రైలును ప్రకటించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
