Gold Price: గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గనుందా..!
బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. గత రెండు రోజులుగా వెండి, బంగారంలో పతనం కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలకు సంబంధించిన తాజా పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళన కలిగిస్తున్నాయి. ముడి చమురు మార్కెట్లో నెలకొన్న తీవ్ర అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల కారణంగా పసిడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎనర్జీ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల కారణంగా రాబోయే రోజుల్లోనూ బంగారం, వెండి ధరల్లో పతనం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియాపై హౌతీల దాడుల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు మే నెల తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది.
ఈ పరిణామాలు ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా పెరిగిన ఇంధన ఖర్చుల కారణంగా అమెరికా వినియోగదారుల ధరల సూచీ పెరగడం ఫెడరల్ రిజర్వ్ విధానాలపై ప్రభావం చూపుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ అధికారులు త్వరలో నిర్ణయాలు తీసుకోనున్న తరుణంలో వడ్డీ ఆదాయం ఇవ్వలేని బంగారంపై ఇన్వెస్టర్లు వెనకడుగు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫెడ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో
బంగారం ధరలపై మరింత భారం పడనుందని గోల్డ్‌మాన్ సాచ్స్ అంచనా వేస్తోంది.

అంతర్జాతీయంగా ఆభరణాల డిమాండ్ పడిపోవడం కూడా బంగారం ధరల పతనానికి మరో కారణంగా చెబుతున్నారు. రాబోయే 6 నెలల పాటు ఔన్సు బంగారం సగటున 4,200 డాల్టర్ల వద్ద ట్రేడ్ కావచ్చునని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 29న విడుదల కానున్న అమెరికా వ్యక్తిగత వినియోగ వ్యయం డేటా రిపోర్ట్ వడ్డీ రేట్ల భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకం అయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో బంగారంపై ఆకర్షణ తగ్గుతోందని నిపుణులు వివరిస్తున్నారు. అయితే చైనా సెంట్రల్ బ్యాంకు బంగారం కొనుగోలు కొనసాగించడం, భారత్ లో బంగారానికి డిమాండ్ ఉండడం వల్ల పసిడి ధరలు భారీగా తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications