UPI Payments: యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.. రూ.2000 మించితే చెల్లించాల్సిందే..!
ఇప్పుడు ఎక్కడ చూసినా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. రూ.5 నుంచి రూ.లక్ష వరకు యూపీఐ ద్వారా చెల్లిస్తున్నారు. యూపీఐ స్టార్ట్ చేసిన ఎలాంటి ఛార్జీలు లేకుండా వాడుతున్నారు. అయితే ప్రీ యూపీఐ చెల్లింపులకు కాలం చెల్లింది. ఇక నుంచి యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. రూ. 2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు లేదా చెల్లింపుల వ్యవస్థ ప్రొవైడర్లు ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలను విధించవని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెప్టెంబర్ 14 నాటి ఒక నోటిఫికేషన్ ద్వారా రూ. 2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలు, రూపే ఆధారిత డెబిట్ కార్డ్ చెల్లింపులను, బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లు ఛార్జీలు విధించలేని ఎలక్ట్రానిక్ పద్ధతులుగా పేర్కొంది.
ఈ నిర్దిష్ట పద్ధతుల ద్వారా చెల్లింపు చేసే లేదా స్వీకరించే వ్యక్తిపై ఏ బ్యాంకు లేదా సిస్టమ్ ప్రొవైడర్ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఛార్జీ విధించకూడదని ఆ నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. రూపే డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులకు కూడా ఇదే రక్షణ వర్తిస్తుంది. ప్రభుత్వం తాజా నోటిఫికేషన్‌లో రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపు చేసే వ్యక్తి ఇప్పుడు రుసుము చెల్లించాల్సి ఉంటుందని చెప్పలేదు. ప్రస్తుత నోటిఫికేషన్ లో రూ.2 వేల పైచిలుకు లావాదేవీలపై ఎంత శాతం ఛార్జీ విధించాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలోని కమిటీ త్వరలో దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

యూపీఐ వ్యవస్థలో భారీగా మరియు నిరంతరం పెరుగుతున్న లావాదేవీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల ఖర్చును ఎవరు భరించాలనేదే ప్రధాన విధానపరమైన అంశంగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 44గా ఉన్న UPI అనుసంధానిత బ్యాంకుల సంఖ్య జూలై 2026 నాటికి 741కి పెరిగింది. జూలై 2026లో నెలవారీ UPI లావాదేవీలు రికార్డు స్థాయిలో 2,366 కోట్లకు చేరుకున్నాయి. మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత, మోసాల నివారణపై ఖర్చులు పెరుగుతున్నందున, ఈ వ్యవస్థకు ఒక సుస్థిరమైన ఆదాయ నమూనా అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే ఎండీఆర్ ఛార్జీలను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
MDR, లేదా 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' అనేది డిజిటల్ చెల్లింపు ప్రక్రియ కోసం వసూలు చేసే రుసుము. అధిక విలువ కలిగిన UPI చెల్లింపులను స్వీకరించే కొన్ని పెద్ద వ్యాపారుల విషయంలో ఇటువంటి రుసుమును ప్రవేశపెట్టవచ్చా అనే దానిపై చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో ఏదైనా MDR అమలులోకి వస్తే అది నామమాత్రంగా ఉంటుందని, అలాగే నిర్దిష్ట పరిమితి (threshold) కంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు మాత్రమే పరిమితం అవుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
