Gold Update: పరిస్థితులు ఇలానే ఉంటే బంగారం ధర రూ. 2 లక్షలకు చేరుతుంది..!

బంగారం ధర దూసుకెళ్తోంది. ఈ రోజు కూడా పసిడి ధర భారీగా పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్‌ను అనూహ్యంగా పెంచడం, డాలర్‌ బలహీనపడటం, బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం వంటి పరిణామాలు పసిడి ధరల పెరుగుదలకు కారణంగా విశ్లేషిస్తున్నారు. ఈ రోజు దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1210 పెరిగి రూ.1,60,480 వద్ద కొనసాగుతుండగా.. తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.1110 పెరిగి రూ.1,47,100 వద్ద ట్రేడవుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.900 పెరిగి రూ.1,20,360కి చేరింది. అంతర్జాతీయంగా కూడా పసిడి ధర పెరిగింది.

శుక్రవారం స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి సుమారు 4,537 డాలర్లకు చేరింది. ఔన్స్ గోల్డ్ ధర వారంలో దాదాపు 3.6 శాతం పెరిగింది. అమెరికా ట్రెజరీ ఆగస్టు 19న 10 నుంచి 30 ఏళ్ల కాలపరిమితి ఉన్న ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్‌ కార్యకలాపాల పరిమాణాన్ని ఒక్కో ఆపరేషన్‌కు 2 బిలియన్‌ డాలర్ల నుంచి కనీసం 4 బిలియన్‌ డాలర్లకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీర్ఘకాలిక బాండ్‌ మార్కెట్లో లిక్విడిటీని మెరుగుపరచడం, ఇటీవల పెరిగిన ఈల్డ్స్‌ను అదుపులోకి తీసుకురావడం కోసం ఈ చర్యలు తీసుకుంది. ఈ ప్రకటనతో అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ గణనీయంగా తగ్గింది. దీంతో డాలర్‌ కూడా బలహీనపడింది.

Gold

అదే సమయంలో బంగారం ధర పెరిగింది. మరోవైపు ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి వైపు మళ్లుతున్నారు. దీంతో బంగారం ర్యాలీ కొనసాగుతోంది. చమురు ధరలు ఇలాగే ఉంటే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించడంలో వెనుకడుగు వేసినా పసిడి ధర పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రెట్లు తక్కువ ఉంటే బంగారం ధర తగ్గుతుంది. కానీ ఇక్కడ బలహీనమైన డాలర్‌ కారణంగా.. వడ్డీ రేటు పెంచకపోయినా పసిడి ధర పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆగస్టులో ఇప్పటివరకు అంతర్జాతీయ బంగారం ధర దాదాపు 11 శాతానికి పైగా దూసుకెళ్లింది. ఆగస్టు 19న ఒక్కరోజే స్పాట్‌ గోల్డ్‌ 3 శాతానికి పైగా దూసుకెళ్లి 4,500 డాలర్ల స్థాయికి చేరుకుంది. అయితే బంగారం జనవరిలో నమోదైన రికార్డు గరిష్ఠ స్థాయి 5,318.40 డాలర్లతో పోలిస్తే ఇంకా దాదాపు 15 శాతం తక్కువగానే ఉంది. అయితే ఇలాంటి పరిస్థితులే కొనసాగితే.. జనవరి గరిష్టాన్ని తాగాడంతో పాటు ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తులం బంగారం రూ.2 లక్షలు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+