Gold: ఈ ధనత్రయోదశి రోజు రూ.60 వేల కోట్ల విలువైన బంగారం కొనుగోలు..!
ధనత్రయోదశి రోజు బంగారం కొంటే మంచి జరుగుతుందని, సిరిసంపదలు వస్తాయని చాలా నమ్మం. అందుకే ఈ ధనత్రయోదశికి ప్రజలు భారీగా బంగారాన్ని కొనుగోలు చేశారు. అర గ్రాము, గ్రాము, అర తులం, తులం కొనుగోలు చేశారు. బంగారమే కాదు.. వెండిని కూడా భారీగా కొన్నారు. పసిడి ధరలు తగ్గడం కూడా బంగారం కొనుగోలు చేయడానికి జనం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అందుకే ధనత్రయోదశి రోజు భారీగా పుత్తడి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ధనత్రయోదశి రోజున దేశంలో మొత్తం బంగారు వ్యాపారం విలువ పరంగా 15 నుంచి 20 శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ ధనత్రయోదశి రోజున దాదాపు రూ. 60వేల కోట్లకు చేరుకుంటుందని అఖిల భారత జెమ్స్ అండ్ జ్యువెలర్స్ దేశీయ కౌన్సిల్ అంచనా వేస్తోంది. గత జనవరి 29న రికార్డు స్థాయికి చేరిన ధరలతో పోలిస్తే ప్రస్తుతం పసిడి భారీగా తగ్గింది. ధనత్రయోదశి రోజు దేశంలోని చాలా ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్లపసిడి రూ.1,46, 300 ఉంది. బంగారం ధర తక్కువగా ఉండడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఆ రోజు పోలిస్తే బంగారం ధరలు కాస్త పెరిగాయి. వెండి కూడా ధరలు కూడా భారీగా తగ్గడంతో కొనుగోళ్లు పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో కిలో వెండి గరిష్ట స్థాయికి చేరాయి. అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు 52 శాతం ధరలు పతనం అయ్యాయి. వెండి కిలో రూ.లక్షా 92వేల 500 వద్ద కొనసాగుతోంది.

పెరిగిన ధరల నేపథ్యంలో వినియోగదారులు తెలివైన నిర్ణయాలు తీసుకున్నారని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు భారీ ఆభరణాలకు బదులుగా లైట్ వెయిట్ జ్యువెలరీ, 18 క్యారెట్ల నగల వైపు ఎక్కువ మొగ్గు చూపారని వ్యాపారులు పేర్కొన్నారు. చిన్న సైజు కాయిన్లు, బార్లు, పెండెంట్స్, గాజులు, గొలుసులకు డిమాండ్ భారీగా పెరిగినట్లు వివరిస్తున్నారు. జైపూర్, సూరత్, డెహ్రాడూన్, రాయ్‌పూర్ వంటి చిన్న నగరాల్లోనూ ఫస్ట్-టైమ్ బైయర్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించిందని వ్యాపారులు పేర్కొన్నారు. పాత బంగారాన్ని ఇచ్చి కొత్త ఆభరణాలు కొనుగోలు చేసే ట్రెండ్ ఈసారి కూడా కొనసాగింది.
అటు డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్ ఈటీఎఫ్ ల్లో కూడా భారీగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థలు కల్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్, పీఎన్జీ జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్స్ వంటి దిగ్గజ సంస్థలు తమ అమ్మకాలు 25% నుంచి 50% వరకు పెరిగినట్లు పేర్కొన్నాయి. రాబోయే పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చాలా మంది ముందుగానే షాపింగ్ పూర్తి చేసుకున్నారని వ్యాపారులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications