Gold Price: మళ్లీ బంగారం ధరలకు టైమొచ్చింది.. ఇక పరుగు ఆగదా..!

1qబంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. తాజాగా బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారట్ల తులం ధర రూ.4300 పెరిగి రూ.1,59,270కి చేరింది. ఇక 22 క్యారట్ల తులం బంగారం ధర రూ.3950 పెరిగి రూ.1,46,000 పలుకుతోంది. గత నెల రోజులుగా బంగారం తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతోన్నాయి. దేశీయంగా డిమాండ్ పెరగడంతో పసిడి ధర పెరుగుతోంది. రాబోయే పండుగ సీజన్‌లో బంగారం కొనుగోళ్లు జోరందుకుంటాయన్న అంచనా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు పెరగడం వల్ల కొనుగోళ్లు తగ్గుతాయని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తోంది.

ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులను వినియోగదారులు కొనుగోలు అవకాశంగా పరిగణిస్తున్నారని అందుకే జ్యువెలరీ డిమాండ్‌ పుంజుకుంటోందని పేర్కొంటుంది. జూన్‌ తర్వాత ధరలు భారీగా తగ్గడం, జూలైలో స్థిరంగా ఉండటం, ఆగస్టులో మళ్లీ రికవరీ నేపథ్యంలో కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం తప్పనిసరిగా బంగారం కొనాల్సి వస్తోంది. దేశీయ డిమాండ్, డాలర్ బలహీనపడడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో బంగారం ధరలు దూసుకెళ్తున్నాయని నిపుణులు అంచా వేస్తున్నారు. అటు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నాయి. చైనా, జపాన్ భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.

Gold

జూలైలో చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా దాదాపు 20 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో చైనా మొత్తం బంగారు నిల్వలు 2,366 టన్నులకు చేరుకున్నాయి. గత 21 నెలల్లో చైనా చేసిన బంగారు కొనుగోలు ఇదే అత్యధికం. అంటే గత 21 నెలలను పరిశీలిస్తే చైనా జూలైలోనే భారీగా పసిడి కొనుగోలు చేసింది. చైనా ప్రజలు కేవలం జూలై నెలలోనే సుమారు 5 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టారు. జపాన్ కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. దీని కారణంగా, బంగారానికి డిమాండ్ పెరుగుతూనే ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి బంగారం ధర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తనకు తెలిసిన ఆర్థిక నిపుణుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు బంగారం, వెండి ధరలపై భారీ అంచనాలు వేస్తున్నారని రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బంగారం ధర ఔన్సుకు 10,000 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది జరగడం పక్కా కాదు.. కొందరు నిపుణులు చేస్తున్న అంచనాలు మాత్రమేనని తెలిపారు. మార్కెట్ పరిస్థితులు మారితే ఈ అంచనాలు కూడా మారే అవకాశం ఉందని చెప్పారు. బంగారం, వెండి రెండింటినీ గురించి మాట్లాడినప్పటికీ 2026 ఆగస్టులో తనకు మాత్రం వెండే మంచి ఎంపికగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

భవిష్యత్తులో వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. వెండి కేవలం పెట్టుబడి లోహం మాత్రమే కాదన్నారు. సౌర విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఇతర పారిశ్రామిక రంగాల్లో కూడా వెండిని ఉపయోగిస్తున్నారని గుర్తు చేశారు. దీంతో భవిష్యత్తులో పారిశ్రామిక డిమాండ్ పెరిగితే వెండికి అదనపు మద్దతు లభించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే రాగి ధర కూడా పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. అందుకే వెండి, బంగారం, రాగిలో పెట్టబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. బంగారం ధరలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు క్రమంగా పెట్టుబడి పెట్టాలన్నారు. ఒకేసారి పెట్టుబడి పెడితే నష్టభయం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+