Gold: టన్నుల కొద్ది బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. పసిడి తులానికి రూ.2 లక్షలకు చేరే అవకాశం..!
బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో భారీగా పెరిగిన పసిడి ధర తగ్గుతూ వచ్చింది. ఆగస్ట్ లో మళ్లీ పెరుగుతోంది.8 నెలల క్రితం చైనా సెంట్రల్ బ్యాంకు భారీగా బంగారం కొనుగోలు చేయడంతో గా 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 18,000 రూపాయలకు పైగా పెరిగింది. ఆ తర్వాత పసిడి ధర కాస్త తగ్గుతూ వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలాగే ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కూడా ముగింపుకు రాకుండా కొనసాగుతుండగా, ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా దేశాలు, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి వివిధ చర్యలు తీసుకుంటున్న తరుణంలో చైనా దృష్టి మరోసారి బంగారంపై పడింది. జూలైలో చైనా ఆర్థిక వృద్ధి తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు జూన్‌లోని 5.3 శాతం నుంచి 4.5 శాతానికి పడిపోయింది. రిటైల్ అమ్మకాలు కూడా జనవరిలోని 2.5 శాతం నుంచి కేవలం 0.6 శాతానికి తగ్గాయి. స్థిరాస్తి పెట్టుబడి 6.7 శాతానికి పడిపోయింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడి 19.2 శాతానికి తగ్గాయి ఈ నేపథ్యంలోనే చైనా పెట్టుబడి మార్కెట్ బంగారం వైపు మళ్లింది. జూలైలో చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా దాదాపు 20 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.

దీంతో చైనా మొత్తం బంగారు నిల్వలు 2,366 టన్నులకు చేరుకున్నాయి. గత 21 నెలల్లో చైనా చేసిన బంగారు కొనుగోలు ఇదే అత్యధికం. అంటే గత 21 నెలలను పరిశీలిస్తే చైనా జూలైలోనే భారీగా పసిడి కొనుగోలు చేసింది. చైనా ప్రజలు కేవలం జూలై నెలలోనే సుమారు 5 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టారు. ప్రజలు, ప్రభుత్వ సంస్థలు తమ బంగారంపై భారీగా పెట్టుబడి పెడుతున్న నేపథ్యం పసిడి ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం ధరలు అధికంగా ఉన్నప్పటికీ చైనా అధిక వాణిజ్యం ఉంటుందని అంచనా వేసే టోకు బంగారు మార్కెట్, 8 శాతం క్షీణించి కేవలం 80 టన్నులకు పడిపోయింది.
అదేవిధంగా అక్కడ బంగారు ఆభరణాల అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. ఫలితంగా చైనా ప్రజలు బంగారాన్ని ఒక పెట్టుబడిగా చూడటం ప్రారంభించి, దానిని సులభంగా నగదుగా మార్చుకునే లక్ష్యంతో లోహ రూపంలో కాకుండా డిజిటల్‌గా బంగారాన్ని కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అటు జపాన్ కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. దీని కారణంగా, బంగారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఫలితంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. చైనా, జపాన్ భారీగా పసిడి కొనుగోలు చేస్తే ఇండియాలో కూడా పసిడి ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే తులం బంగారం రూ.2 లక్షల వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications