Google Maps: గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. మీరు ఇక ఫుడ్ కూడా ఆర్డర్ చేయవచ్చు..!

గతంలో మనం ఎక్కడికి వెళ్లాలన్నా అడ్రస్ అడుక్కుంటూ వెళ్లేవాళ్లం. ఇందుకు చాలా సమయం పట్టేది. కానీ.. గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలంటే.. లోకేషన్ షేర్ చేయమని చెబుతాం. గూగుల్ మ్యాప్ సాయంతో అడ్రస్ కు చేరుకుంటాం. ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో గూగుల్ మ్యాప్స్ కామన్ అయిపోయింది. కాగా గూగుల్ మ్యామ్స్ అనేక మార్పులు, కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా గూగుల్ మ్యాప్స్ మరో ఆడుకు ముందుకేసింది.

కేవలం దారి చూపించడమే కాకుండా ఇకపై ఫుడ్‌ ఆర్డర్‌, హోటల్‌ సెర్చ్‌ వంటివీ గూగుల్ మ్యాప్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఆస్క్‌ మ్యాప్స్‌ పేరిట కొత్త ఫీచర్లు తీసుకొచ్చినట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో వివరించింది. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఏదైనా తినాలనిపిస్తే వేరేగా రెస్టరంట్ల కోసం వెతికే పని లేకుండా ఆస్క్‌ మ్యాప్స్‌లోనే ఈ సదుపాయం ఉంది. మీకు బటర్ చికెన్ బిర్యానీ లేదా మిర్చీ భజ్జీ తినాలనిపిస్తే ఒకదాని తర్వాత ఒకటిగా రెస్టారెంట్ల కోసం వెతకడానికి బదులుగా, మీరు కేవలం 'మ్యాప్స్‌ను అడగొచ్చు.

google maps

ఈ యాప్, మీరు తినాలని కోరుకుంటున్న వంటకాన్ని అందించే భోజనశాలల కోసం మీ మార్గంలో వెతుకుతుంది. అవి తెరిచి ఉన్నాయో లేదో తనిఖీ చేస్తుంది. అలాగే కావాల్సిన రెస్టరంట్లను వెతకడం, కావాల్సిన వంటకాలను నేరుగా కార్ట్‌కు యాడ్‌ చేయడం వంటివి ఆస్క్ మ్యాప్స్ లో చేయవచ్చు. ఇదే తరహాలో హోటళ్లు వెతకడం, కాన్సర్టులు, కామెడీ షోలకు టికెట్‌ బుకింగ్‌కు సంబంధించిన లింకులూ పొందొచ్చని గూగుల్ తెలిపింది. చెక్-ఇన్ చేసిన తర్వాత ఏమి చేయాలో ప్లాన్ చేసుకోవడం కూడా సులభతరం అవుతుందని వివరించింది.

ఆస్క్ మ్యాప్స్ మీ ప్రయాణ సమయంలో జరిగే సమీపంలోని పండుగలు, సంగీత కచేరీలు, స్థానిక ఆకర్షణలను, టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి లింక్‌లతో పాటు సిఫార్సు చేయగలదని తెలిపింది. మీ జీమెయిల్‌లో ఉన్న ప్రయాణ వివరాలను (ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్‌లు) అనుసంధానించుకుని, దానికి తగిన విధంగా ప్రయాణ సూచనలు పొందొచ్చు. గూగుల్‌ మ్యాప్స్‌ ఇకపై మీ పాత సంభాషణలనూ కూడా గుర్తుంచుకుంటుందని కంపెనీ తెలిపింది. భారత్‌లో ఇంగ్లిష్‌లోనే కాకుండా హిందీలోనూ ఆస్క్‌ మ్యాప్స్‌లో ప్రశ్నలు అడిగి హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాంతాల వివరాలు తెలుసుకోవచ్చని కంపెనీ వివరించింది. భారత్‌, అమెరికా సహా 150కి పైగా దేశాల్లో ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+