Hyderabad: హైదరాబాదీలకు షాక్.. ఇక నీరు దోరకడం కష్టమే..!

హైదరాబాద్ మహానగర వాసులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. వచ్చే వేసవి కాలం నాటికి హైదరాబాద్ లో తీవ్ర నీటి కొరత ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు పడిపోయాయని.. వర్షాలు లేకుంటే తీవ్రమైన నీటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. రోజుకు 500 నుంచి 600 బోర్లు ఎండిపోతున్నాయని చెబుతున్నారు. సిటీలో ఇప్పటికే 5 వేల నుంచి 6 వేల బోర్లు పూర్తిగా ఎండిపోయినట్లు చెబుతున్నారు. అటు ప్రాజెక్టుల్లో కూడా నీరు లేకపోవడంతో హైదరాబాద్ కు నీటి తరలించడం కష్టంగా మారుతుంది. కృష్ణా బేసిన లోని ప్రాజెక్టుల్లో నీరు డెడ్ స్టోరేజీకి చేరింది. ఇటు గోదావరిలోని ప్రవాహం లేదు. మంజీరాలో కూడా నీరు అంతంత మాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరం వాసులు నీటి కోసం కష్టాలు పడాల్సి వస్తుందంటూ నిపుణులు చెబుతున్నారు.

ఎన్ లినో ప్రభావంతో వర్షాలు కురవడం కష్టమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో హైదరాబాద్ లో నీటి సమస్య తీవ్రమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సిటీలో రోజు 18 వేల నీటి ట్యాంకర్లు వాడుతున్నారు. అయితే సిటీలోని చెరువుల్లో కూడా నీరు అడుగంటుతుంది. దీంతో ట్యాంకర్ల ద్వారా కూడా నీటి సరఫరా కష్టంగా మారింది. క్యూర్ పరిధిలోని మొత్తం 14.50 లక్షల నీటి కనెక్షన్​లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రోజువారీగా 550 మిలియన్ గ్యాలరీ పర్​ డే నీటిని సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేట్ ట్యాంకర్ యజమానులు దోచుకుంటున్నారు.

water

జంట జలాశయాల పరీవాహక ప్రాంతాలలోని శిఖం భూముల్లో అక్రమంగా బోర్లు తవ్వి, విచక్షణారహితంగా నీటిని లాగుతున్నారు. నగరానికి నీటి సరఫరా కోసం వారు వ్యవసాయ బోర్లను కూడా లీజుకు తీసుకొంటున్నారు. మదాపూర్ సున్న చెరువు వద్ద ఇష్టమొచ్చినట్లు బోర్లు వేసి నీటి తప్పువుతున్నారు. ఒక్కో ట్యాంకరుకు రూ.600 నుంచి రూ.1000 వసూలు చేస్తున్నారు. భవిష్యత్ లో ఇది రూ.2000 చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

నీటి సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. నీటి ఎద్దడి రాబోతున్నదని, దీనిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని కోరారు. సిటీలో ఇప్పటికే వేల సంఖ్యలో బోర్లు ఎండిపోయినట్లు చెప్పారు. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇల్లు, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, విద్యాసంస్థలు నడుంబిగించాలని సూచించారు. సైఫాబాద్‌‌‌‌‌‌‌‌లోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్​ సైన్స్‌‌‌‌‌‌‌‌లో మెట్రోవాటర్​బోర్డు ఆధ్వర్యంలో వర్షపు నీరు సంరక్షణపై నిర్వహించిన ప్రొగ్రామ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలేజీ ప్రాంగణంలోని ఎండిపోయిన బోర్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ను ఇంజెక్షన్ బోర్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌గా పునరుద్ధరించిన రీచార్జ్ పిట్‌‌‌‌‌‌‌‌ను మొదలు పెట్టారు. 2016 నుంచే కొత్త భవనాల్లో రెయిన్‌‌‌‌‌‌‌‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను ప్రభుత్వం తప్పనిసరి చేసిందని గుర్తు చేశారు.

ఇప్పటికే ఉన్న గృహాలు, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు కూడా స్వచ్ఛందంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం వర్షాలు పూర్తిగా నిలిచిపోతే నగరానికి నీటిని అందించే జలాశయాల్లోని నిల్వలు సుమారు 80 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతాయని మెట్రోవాటర్​ బోర్డ్ తెలిపింది. ఈ జలాశయాలపై దాదాపు 3 లక్షల కనెక్షన్లు ఆధారపడి ఉన్నాయని, భవిష్యత్తులో వారికి నీటి సరఫరా కొనసాగించడం కష్టమని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+