Gold Price: బంగారం ధర భారీగా పెరగొచ్చు.. ఇప్పుడే కొనేయాలా..!
బంగారానికి భారతీయుల్లో ప్రత్యేక స్థానం ఉంది. బంగారాన్ని స్టేటస్ చూసేవారు కొందరైతే.. ఒంటి మీద ఇసమెత్తు అన్న బంగారం ఉండాలని కొంత మంది అనుకుంటారు. రోజు కూలీకి వెళ్లే వారైనా పావు తులమో, గ్రామో కొనుగోలు చేస్తారు. ఇక పెళ్లిళ్లు అయితే తప్పుకుండా పసిడి ఉండాల్సిందే. అంతే కాదు ఆపద సమయంలో బంగారం ఉపయోగపడుతుందని కొంత మంది భావిస్తారు. అందుకే భారత దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బంగారం ధర భారీగా పెరిగింది. గత వారం రోజుల నుంచి పసిడి ధర దూసుకెళ్తోంది. అయితే ధరలు ఎప్పుడు తగ్గుతాయాని సామాన్యులు ఎదురు చూస్తున్నారు.
అయితే దేశంలో బంగారం వినియోగం, ఉత్పత్తి, ధరల నియంత్రణపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. భారత్ లో బంగారాన్ని ఒక సాధారణ లోహంగా కాకుండా, అధికారికంగా వ్యూహాత్మక ఖనిజంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు మన దేశంలో ఏ ప్రాంతంలోనైనా మైనింగ్ స్టార్ట్ చేయాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్యావరణ, అటవీ అనుమతులు పొందాలి ఇందుకు సమయం పట్టే అవకాశం ఉంది. పసిడికి వ్యూహాత్మక ఖనిజం హోదా ఇస్తే.. మైనింగ్ కంపెనీలు అనుమతుల కోసం వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాలు చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.

కేంద్రం నుంచే అనుమతి తీసుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు. భారత్‌లో బంగారం నిల్వలు ఉన్నాయి. తవ్వకాలు జరపడం ఖరీదైన వ్యవహారంగా ఉందని చెబుతున్నారు. అందుకేల ప్రైవేట్ కంపెనీలు తవ్వకాలకు మొగ్గు చూపడం లేదని చెబుతున్నారు. పసిడికి వ్యూహాత్మక ఖనిజం హోదా ఇస్తే మైనింగ్ కంపెనీల పెట్టుబడులు పెరిగి, దేశీయంగా బంగారం ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలా జరిగితే బంగారం ధరలు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో బంగారం తవ్వకాలు పెరిగినంత మాత్రాన తక్షణమే ధరలు తగ్గుతాయని అనుకోవడం పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు. పసిడి ధరలు అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా చమురు ధర భారీగా పెరుగుతోంది. దీంతో Gol బంగారం పెట్టుబడి పెడుతున్నారు. దీంతో బంగారం ధర పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications