Gold: భారీగా పెరుగుతున్న మైనింగ్ ఖర్చు.. బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం..!

బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గతవారం పసిడి ధరలు తగ్గినప్పటికీ ఇప్పటికీ పుత్తడి ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే బంగారం ధరలు పెరగడం మైనింగ్ కంపెనీలకు కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని తవ్వడానికి అయ్యే ఖర్చులు పెరుగుతున్నప్పటికీ.. బంగారం ధరలు అంతకంటే వేగంగా పెరగడంతో కంపెనీలకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి.
2026 జనవరి-మార్చి త్రైమాసికంలో ఒక ఔన్స్ బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి మైనింగ్ కంపెనీలకు సగటున 1,785 డాలర్లు ఖర్చు అయ్యేది. గతంతో పోలిస్ 16 శాతం ఎక్కువ. మైనింగ్ రంగంలో ఉత్పత్తి ఖర్చులు వరుసగా 28వ ఏడాది పెరిగాయి.

మైనింగ్ కంపెనీల ఖర్చులు పెరగడానికి రాయల్టీ చెల్లింపులు కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. జనవరిలో బంగారం ధర ఔన్స్‌కు 5,595 డాలర్ల వరకు వెళ్లింది. ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వాలకు చెల్లించాల్సిన రాయల్టీలు కూడా అదే స్థాయిలో పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. 2026 మొదటి త్రైమాసికంలో రాయల్టీ ఖర్చులు గత త్రైమాసికంతో పోలిస్తే 24 శాతం, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 85 శాతం పెరిగాయని పేర్కొంటున్నారు. బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మైనింగ్ కంపెనీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Gold

ఇరాన్ వివాదం కారణంగా సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడ్డాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలతో ఇంధనం, రవాణా, మైనింగ్‌కు అవసరమైన ఇతర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా.. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా పసిడి ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఫెడ్ తీసుకోబోయే నిర్ణయాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బంగారం కొనుగోలు చేసేవారు క్రమక్రమంగా కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర భారీగా తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు. అంతేకాకుండా మైనింగ్ ఖర్చులు పెరగడం, అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు పైకి తప్ప కిందికి వెళ్లే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+