Aadhaar App: కొత్త ఆధార్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారా.. లేకుంటే వెంటనే చేసుకోండి..!

ఇప్పుడు దేశంలో ఏ చిన్న పనికి అయినా ఆధార్ తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో దాదాపు దేశంలోని ప్రతి ఒక్కరు ఆధార్ తీసుకున్నారు. అయితే కొంత మంది ఆధార్ వెంట తీసుకెళ్లడం మర్చిపోతుంటారు. ఇలాంటి వారి కోసం ఉడయ్ దాదాపు 5 నెలల క్రితం కొత్త ఆధార్ యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ ను ఇప్పటివరకు 3.1 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారని ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సేవలను అరచేతిలోకి తీసుకురావడంతో యాప్ ను భారీగా డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన ఈ కొత్త ఆధార్ యాప్, ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నేరుగా మొబైల్ నంబర్ అప్‌డేట్, అడ్రస్ అప్‌డేట్‌లతో సహా వివిధ సేవలను సులభంగా పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.

ఇప్పటివరకు దాదాపు 40 లక్షల మంది కొత్త ఆధార్ యాప్‌ను ద్వారా తమ మొబైల్ నంబర్లను అప్‌డేట్ చేసుకున్నారని సమాచారం. దాదాపు 8,50,000 మంది తమ అడ్రస్ మార్చుకోవడానికి ఈ యాప్‌ను ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఆధార్ ను చూపించడానికి, ఇతరులకు పంపడానికి లేదా ధృవీకరించుకోవడానికి ఈ ఆధార్ యాప్ తీసుకొచ్చారని ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్‌లో ఒకే క్లిక్‌తో బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్, హాజరు రుజువు కోసం ముఖ ధృవీకరణ, క్యూఆర్ ఆధారిత సవరించగలిగే కాంటాక్ట్ కార్డ్ వంటి అనేక ప్రజానుకూల ఫీచర్లు ఉన్నాయి.

aadhaar ap

ఈ యాప్ లో ఇ-ఆధార్‌ను సింపుల్ గా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లడానికి, ఆన్‌లైన్‌లో సులభంగా అపాయింట్‌మెంట్ బుకింగ్‌ ను ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఆధార్ యాప్ ద్వారా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఎంటిటీ (OVSE) క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా హోటల్ చెక్-ఇన్‌లు చేసుకోవచ్చు. ఇది ఆసుపత్రి అడ్మిషన్లు, సందర్శకుల నిర్వహణ, ఈవెంట్ ఎంట్రీలు, గిగ్ వర్కర్లు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే గతంలో ఎం ఆధార్ ఉండేది. అయితే దీన్ని
దశలవారీగా నిలిపివేస్తుంది. ఇప్పుడు అందరు ఆధార్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఉడయ్ స్పష్టం చేసింది.

కొత్త ఆధార్ యాప్, గుర్తింపు నిర్వహణను సులభతరం చేసే ఆధునిక ఇంటర్‌ఫేస్, అనేక అధునాతన ఫీచర్లను అందిస్తుందిని తెలిపింది. మీరు మీ ఆధార్ వివరాలను పొందాలన్నా, మీ గుర్తింపును సురక్షితంగా పంచుకోవాలన్నా, లేదా గోప్యతా సెట్టింగ్‌లను నిర్వహించాలన్నా, ఈ యాప్ ఈ సేవలన్నింటినీ ఒకే చోటకి తీసుకువస్తుందని పేర్కొంది. అందుకే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+