గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం హైదరాబాద్‌లో 25 ఏళ్ల సందర్భంగా కొత్త క్యాంపస్ ప్రారంభించింది. గచ్చిబౌలిలో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో LEED-సర్టిఫైడ్‌తో నిర్మించిన ఈ అత్యాధునిక భవనంలో 2,500 మంది అదనపు ఉద్యోగులకి స్పీడ్ కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భవనాన్ని నేడు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో రాష్ట్ర సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది.

నూతన క్యాంపస్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థకు హైదరాబాద్ తో సుదీర్ఘ అనుబంధం ఉందని, మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు.
ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ భారతీయుడు సత్య నాదెళ్ల నాయకత్వంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది అలాగే ఇండియాలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూనే ఉంది. భారతదేశంలో ఇప్పటికే 20,000 మందికి పైగా టెక్ ఉద్యోగులు ఉన్న ఈ కంపెనీ హైదరాబాద్‌లో కొత్త ఆఫీస్ ప్రారంభించడం విశేషం. భారతదేశంలోని 20,000 మంది ఉద్యోగులలో 10,000 మందికి పైగా హైదరాబాద్‌లో ఉన్నారు. కంపెనీ ప్రస్తుతం అదనంగా 2,500 మంది ఉద్యోగుల కొరకు విస్తరిస్తోంది. ఈ కొత్త ఆఫీసులో 2,500 మంది ఉద్యోగులను అలాగే హైదరాబాద్‌లో 4,800 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని మైక్రోసాఫ్ట్ యోచిస్తోంది.
మైక్రోసాఫ్ట్ తెలంగాణ ప్రభుత్వంతో ఒక ముఖ్యమైన భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. అలాగే రాష్ట్రంలో 1.2 లక్షలకు పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన "అడ్వాంటేజ్(ఐ)జె తెలంగాణ" పథకం కింద, AI ఫౌండేషన్స్ అకాడమీని ప్రారంభించాలని ప్లాన్ చేసింది ఇంకా AI విద్యను 500 ప్రభుత్వ స్కూలుకు తీసుకువెళతారు, దీని వల్ల దాదాపు 50,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. రెండవ ప్రాజెక్ట్ AI-ఇండస్ట్రీ ప్రో ప్రాజెక్ట్ తెలంగాణ అంతటా 20,000 మంది స్కిల్స్ ఎక్స్పర్ట్ పెంపొందించే లక్ష్యంగా ఉంది. మూడవ ప్రాజెక్ట్ AI-గవర్న్ చొరవ, డిజిటల్ ఉత్పాదకత, ఉత్పాదకత AI అండ్ సైబర్ భద్రత వంటి కీలక రంగాలలో 50,000 మంది ప్రభుత్వ అధికారులకు శిక్షణ ఇస్తుంది.
ఇంకా మైక్రోసాఫ్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇతర సంస్థల సహకారంతో AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (AICoE) ను స్థాపించి నిర్వహిస్తుంది. ఈ CoE సెంట్రలైజెడ్ AI నాలెడ్జ్ హబ్, AI అభివృద్ధికి క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాలను అందిస్తుంది. వీటన్నింటికీ అదనంగా భారతదేశంలో AI సేవల వినియోగాన్ని పెంచడానికి ఇంకా AI సేవలను అభివృద్ధి చేసే కంపెనీలకు సేవలందించడానికి హైదరాబాద్‌లో హైపర్‌స్కేల్ AI డేటా సెంటర్‌లను ఏర్పాటు చేయడానికి మైక్రోసాఫ్ట్ రాబోయే సంవత్సరాల్లో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications