HCLTech Salary Hikes: మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతోంది. ఈ క్రమంలో దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వేతన పెంపు ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా కంపెనీలు తమ మూడవ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు సిద్ధం అవటం కూడా ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింప చేస్తోంది. పైగా దీర్ఘకాలం కొనసాగిన మందగమనం నుంచి కంపెనీలు బయటపడటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నిన్న దేశంలోని రెండవ అతిపెద్ద టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు అందించాల్సిన వేతన పెంపులను ప్రస్తుతం నాలుగో త్రైమాసికానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన కేవలం ఒక్క రోజు తర్వాత దేశంలోని మూడవ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ HCLTech అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జూనియర్ ఉద్యోగులకు వేతనాల పెంపును పాక్షికంగా ప్రారంభించిందని వెల్లడైంది. ప్రస్తుతం జూనియర్ లెవెల్ ఉద్యోగుల్లో చాలామందికి దాదాపు 1-2 శాతం ఇంక్రిమెంట్ అందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే వీరిలో అత్యుత్తమ పనితీరును కనబరిచిన ఉద్యోగులకు కంపెనీ 3-4 శాతం మేర వేతన పెంపును అందించిందని సమాచారం.

కంపెనీ ప్రస్తుతం అందించిన హైక్స్ టెక్కీలను పూర్తిగా నిరాశకు గురిచేశాయని తెలుస్తోంది. గతంలో కంపెనీ సగటున 7 శాతం వేతన పెంపుతో పాటు అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి 12-15 శాతం హైక్స్ అందించిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం అందిస్తున్న వేతన పెంపులు చాలా తక్కువగా అందిస్తూ కంపెనీ భిన్నంగా పే హైక్స్ ప్రకటించటం ఉద్యోగుల్లో చర్చకు దారితీసింది. HCLTech ప్రస్తుతం.. E0, E1, E2 కేటగిరీల్లోని సిబ్బందికి వేతన పెంపులను ప్రారంభించిందని సమాచారం. వీరు దాదాపు 10 సంవత్సరాల వరకు అనుభవం కలిగిన జూనియర్ స్థాయి ఉద్యోగులుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం E3 బ్యాండ్ ఆపైన ఉండే మిడిల్ అండ్ సీనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వేతన పెంపులను ప్రకటించలేదు.
హెచ్‌సిఎల్‌టెక్ మేనేజ్‌మెంట్ FY24లో కూడా సీనియర్ నుంచి మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగులకు సంవత్సరానికి వేతన పెంపు సైకిల్ దాటవేసినట్లు తెలుస్తోంది. E0-E2 మధ్య స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కంపెనీ నుంచి వేతన పెంపులకు సంబంధించిన వివరాలను డిసెంబరులోనే అందుకున్నట్లు తెలుస్తోంది. E4 స్థాయి స్థాయి ఉద్యోగులకు కంపెనీ మూడేళ్లుగా ఎలాంటి వేతన పెంపులను ప్రకటించలేదని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ మనీకంట్రోల్ కి అందిన అంతర్గత సమాచారం ద్వారా విషయం బయటకు వచ్చింది. కొత్తగా చేరిన ఉద్యోగులు ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటేనే ప్రస్తుత హైక్ సైకిల్ లో వేతన పెంపుకు అర్హులుగా పరిగణించినట్లు కంపెనీ వెల్లడించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications