డిగ్రీతో టెక్ మహీంద్రాలో జాబ్.. నెలకు 30వేల జీతం.. క్యాబ్ ఫెసిలిటీ కూడా..
ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా అంతర్జాతీయ కస్టమర్ సపోర్ట్ కోసం రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది. కనీసం 1 ఏడాది పాటు కస్టమర్ సపోర్ట్ జాబ్ చేసిన అనుభవం ఉన్నవారు ఈ పోస్టుకు అప్లయ్ చేసుకోవచ్చు.
ఉద్యోగ వివరాలు
జీతం నెలకు రూ.28,000 నుండి రూ.33,000 మధ్య ఉంటుంది. ఈ ఉద్యోగం ఫుల్ టైం ఉద్యోగం. అలాగే షిఫ్ట్ ప్రకారం లేదా షెడ్యూల్ ప్రకారం రోటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఇక బెనిఫిట్స్ గురించి మాట్లాడితే ట్రావెల్ అసిస్టెన్స్ కల్పిస్తారు. జాబ్ రోల్ గురించి చెప్పాలంటే అంతర్జాతీయ కస్టమర్ సపోర్ట్ కోసం మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకు మీకు అంతర్జాతీయ కస్టమర్ సపోర్ట్ ఇన్‌బౌండ్‌లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి అని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా అప్లయ్ చేసుకోవడానికి అర్హులుగా తెలిపింది. జీతం ప్యాకేజీ చేస్తే ఏడాదికి 3.9 లక్షల నుండి 4.6 వరకు ఉంటుంది.

ఈ కంపెనీలో మీకు 5 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి. అలాగే మీకు వారానికి 2 రొటేషనల్ వీక్‌ఆఫ్‌లు ఉంటాయి. ఇంకా ఈ వీక్‌ఆఫ్‌లు మీ రోటేషన్ల్ షిఫ్ట్స్ బట్టి మారుతుండొచ్చు. మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే 2 వే క్యాబ్ అంటే పికప్ ఇంకా డ్రాప్ సర్వీస్ అందిస్తారు. మీ లొకేషన్ పరంగా ఈ సర్వీస్ ఉంటుంది. ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్లోని హైటెక్ సిటీ. అనుభవంతో పాటు మీకు లాంగ్వేజ్ స్కిల్స్ పరంగా హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడగలిగితే ప్రాధాన్యత ఉంటుంది.
అలాగే హిందీ కూడా మాట్లాడటం వచ్చి ఉండాలి. అంతర్జాతీయ వాయిస్‌లో కనీసం 1 సంవత్సరం అనుభవంతో అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారు ఎవరైనా ఈ ఉద్యోగావకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సర్టిఫికెట్స్ ప్రకారం హయ్యర్ ఎడ్యుకేషన్ 12th ఉత్తీర్ణత సర్టిఫికెట్స్ అవసరం. మొత్తంగా 1 సంవత్సరం కనీస అనుభవం అలాగే కస్టమర్ సర్వీసులో 1 సంవత్సరం అవసరం ఉండాలి. మీకు మరింత సమాచారం లేదా వివరాల కోసం 841073836/[email protected] ద్వారా సంప్రదించవచ్చు లేదా +91 8341073836 నంబరుకు కాల్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications