అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్స్ ఫైలింగ్ గడువును సెప్టెంబర్ 30, 2021కి పొడిగించారు. వివిధ రకాల ఐటీ రిటర్న్స్ ఉంటాయి. శాలరీ, సొంత ఇల్లు ప్రాపర్టీ, డివిడెండ్, వడ్డీ ఆదాయం, ఫ్యామిలీ పెన్షన్ వంటివి ఉంటే ఐటీఆర్-1(సహజ్) ఫైల్ చేస్తారు. ఐటీఆర్-1ను కేవలం పర్సన్ ఫైల్ చేయరు. కంపెనీ డైరెక్టర్ వంటి వారు దాఖలు చేస్తారు. ఐటీఆర్ 2, ఐటీఆర్ 4, ఐటీఆర్ 3 ఉంటాయి. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌తో ప్రయోజనాలు
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే పలు ప్రయోజనాలు ఉంటాయి. ఇండివిడ్యువల్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా లోన్ అప్రూవల్ ఈజీ అవుతుంది. టూ-వీలర్ లేదా 4-వీలర్ లేదా హోమ్ లోన్ వంటి వాటికి సులభమైన అప్రూవల్ లభిస్తుంది. దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు ట్యాక్స్ రిటర్న్స్ కాపీని అడుగుతాయి.

ట్యాక్స్ రీఫండ్ క్లెయిమ్
ఆదాయపు పన్ను దాఖలు చేస్తే ట్యాక్స్ రీఫండ్ అవుతుంది. అంటే మీరు చెల్లించిన దానికి గాను ఐటీ శాఖ నుండి ఏమైనా రావాల్సి ఉంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా వస్తుంది.

ఆదాయం, అడ్రస్ ప్రూఫ్
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తే ఇది ఆదాయ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కోసం ఉపయోగపడుతుంది.

వీసా ప్రాసెస్
వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో గత కొన్నేళ్లుగా మీరు దాఖలు చేసే ఐటీ రిటర్న్స్ కాపీలను ఎంబసీలు, కాన్సులేట్లకు అందించాలి.

నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేయవచ్చు
నిర్ణీత తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఇది తర్వాత సంవత్సరాల ఆదాయానికి సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications