Cognizant: లాభాల అంచనాలను అధిగమించిన కాగ్నిజెంచ్.. మళ్లీ ఉద్యోగుల కోత ప్రకటన..
Cognizant News: ఐటీ సేవల కంపెనీల్లో ఆర్థిక అల్లకల్లోలం కొనసాగుతోంది. ఈ క్రమంలో తక్కువ ఆదాయాలు, ప్రాజెక్టులు కంపెనీలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో టెక్ కంపెనీ కాగ్నిజెంట్ కొన్ని ప్రకటనలు చేసింది.
2023లో కంపెనీ ఆదాయం తగ్గుతుందని టెక్ సంస్థ కాగ్నిజెంచ్ అంచనా వేసినట్లు ప్రకటించింది. ఇది ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టకాలాన్ని హైలైట్ చేస్తుంది. పైగా కంపెనీకి అమెరికా నుంచి ప్రధాన ఆదాయాలు వస్తున్న తరుణంలో అక్కడి పరిస్థితులతో ఖర్చుల తగ్గింపు చర్యలను పాటిస్తోంది. ఇప్పటికే కార్యాలయాన్ని మూసివేయటంతో పాటు 3,500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.

కొత్తగా నియమితులైన కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ప్రత్యర్థి ఐటీ కంపెనీలతో పోటీ పడటాన్ని ఎదుర్కొంటున్నారు. భారత్ కేంద్రంగా ప్రారంభమైన కంపెనీ ఆ తర్వాత ప్రధాన కార్యాలయాన్ని అమెరికాకు మార్చినప్పటికీ.. కార్యకలాపాల్లో ఎక్కువ భాగం ఇండియాలోనే ఉన్నాయి. పూర్తి ఏడాదికి ఆదాయ టార్గెట్లను 19.2-19.6 బిలియన్ డాలర్లుగా పెట్టుకుంది. ఇదే క్రమంలో ఆదాయ మార్జిన్లు 14.6 శాతంగా ఉన్నాయి. అయితే మార్జిన్ రేటు టెక్ మహీంద్రాతో పోల్చదగినదిగా ఉంటూ ఐటీ పరిశ్రమలో అత్యల్పమైనదిగా నమోదైంది.

అయితే FY23 మొదటి త్రైమాసికంలో కాగ్నిజెంట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. మాజీ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ జనవరిలో తొలగించబడిన తర్వాత వచ్చిన ఫలితాలు కావటం గమనార్హం. ఈ క్రమంలో ఏడాది ప్రాతిపదికన నికర లాభంలో 3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ప్రస్తుతం కంపెనీ ఆదాయం 4.81 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది కంపెనీ అంచనాలను అధిగమించింది.


Click it and Unblock the Notifications