IT News: ఉద్యోగులకు ఐటీ కంపెనీ సూపర్ గిఫ్ట్.. ఆనందంలో వేల మంది టెక్కీలు..
IT News: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్ ఉద్యోగులు ఆందోళనకర పరిస్థితులను చూస్తున్నారు. ఎప్పుడు కంపెనీలు ఉద్యోగం పీకేస్తాయోనని మదనపడుతున్నారు. పైగా కంపెనీలు సైతం రోజుకో ప్రకటన చేస్తూ వేల మందిని తొలిగించినట్లు ప్రకటిస్తూ బాంబు పేలుస్తున్నాయి.
ఈ తరుణంలో గ్లోబల్ ఐటీ సేవల సంస్థ కొఫొర్జీ తన ఉద్యోగులకు మంచి గిఫ్డ్ అందించింది. నామమాత్రంగా కొంత మందికి మాత్రమే కాకుండా ఏకంగా 21 వేల మంది ఉద్యోగులకు ఆపిల్ ఐపాడ్స్ ఇచ్చింది. ఒకపక్క ఖర్చులు తగ్గించుకునేందుకు దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తుంటే.. కొఫొర్జీ ఇలాంటి నిర్ణయం తీసుకోవటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టెక్ సంస్థ ఆదాయం 1 బిలియన్ డాలర్లు అంటే రూ.8000 కోట్ల మార్కును దాటటంతో కంపెనీ తన ఉద్యోగులను సత్కరించాలని నిర్ణయించింది. అలాగే నికల లాభం రూ.811 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. అలాగే మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.2,170 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో నికర లాభం రూ.232 కోట్లుగా నమోదుచేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనబరచడానికి ఇది ప్రోత్సాహకంగా నిలుస్తుందని Coforge CEO సుధీర్ సింగ్ వెల్లడించారు.
మంచి లాభాలను నమోదు చేయటంతో కంపెనీ ఒక్కో షేరుపై రూ.19 మధ్యంతర డివిడెండ్ అందించనున్నట్లు వెల్లడించింది. దీనికోసం రికార్డు తేదీని 9, 2023గా బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం 21 దేశాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టెక్ కంపెనీ 21,815 మంది ఉద్యోగులను సత్కరించేందుకు దాదాపు రూ.80 కోట్లను వెచ్చించింది.


Click it and Unblock the Notifications