Bengaluru News: భారతదేశానికి సిలికాన్ వ్యాలీగా ఐటీ రంగంతో పాటు టెక్నాలజీ, స్టార్టప్ వంటి కొత్త ఆవిష్కరణలకు చిరునామాగా మారిన ప్రదేశం కర్ణాటకలోని బెంగళూరు. అందుకే ఇక్కడ స్టార్ట్ చేసిన కంపెనీలకు డిమాండ్ ఎక్కువ. పైగా అనుభవజ్ఞులైన ఉద్యోగుల లభ్యత ఈ నగరంలో ఎల్లప్పుడూ ఎక్కువే. అందువల్ల దేశంలోని అనేక ప్రాంతాల నుంచి నిరంతరం ఉద్యోగాల కోసం వలస వస్తున్న వారి సంఖ్య నగరానికి పెరుగుతూనే ఉంది.
ఇటీవలి కాలంలో కార్పొరేట్ దిగ్గజాలను నడిపిస్తున్న సంస్థల యజమానులు ఉద్యోగుల పనిగంటలపై చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి ఉన్నత స్థాయి నాయకులు 70-90 గంటలు ఉద్యోగులు పనిచేయాలని, ఇది దేశాన్ని ముందుకు నడిపించటంలో దోహదపడుతుందని చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే లేపాయి. ప్రధానంగా ఇలాంటి వాటి వల్ల ఉద్యోగులు తమ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్పుతోందని అంటున్నారు.

తాజాగా దీనిపై నిరసన తెలుపుతూ ఐటీ రంగంలో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగులు నగరంలోని ఫ్రీడమ్ పార్క్ వద్ద కలిశారు. ఈ క్రమంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఉద్యోగి హక్కుగా పేర్కొంటూ వారు ర్యాలీ నిర్వహించారు. ఐటీ పరిశ్రమలో కూడా లేబర్ చట్టాల అమలు కఠినంగా చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని కర్ణాటర రాష్ట్ర ఐటీ ఉద్యోగుల సంఘం నిర్వహించింది.
టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి అదనపు వేతనం లేకుండా అధికారిక సమయానికి మించి పని చేయాలని యాజమాన్యాలు కోరటాన్ని యూనియన్ తప్పుపట్టింది. అవాస్తవిక డెడ్ లైన్స్, వేతనం లేని ఓవర్ టైం పని, క్రమబద్ధీకరించని వాతావరణం వల్ల ఒత్తిళ్లు ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు యూనియన్ పేర్కొంది.
ఈ విషయంపై ఆందోళన కలిగిస్తున్న అధ్యయన ఫలితాలను కూడా వారు ఈ సందర్భంగా హైలైట్ చేస్తున్నారు. ప్రస్తుతం 70% కంటే ఎక్కువ మంది ఐటీ రంగంలోని ఉద్యోగులు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడైంది. బర్న్ అవుట్, దీర్ఘకాలిక ఒత్తిడి, మారిన లైఫ్ స్టైల్ వల్ల వ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయన్నారు.
రోజువారీ గరిష్ట పని గంటలను 12 నుండి 14 గంటలకు పెంచే లక్ష్యంతో కర్ణాటక దుకాణాలు వాణిజ్య సంస్థల చట్టం, 1961కు సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించటాన్ని చాలా మంది ఐటీ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. మహిళలను నెమ్మదిగా ఈ రంగం నుంచి తగ్గిస్తున్నారని వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రష్మీ చౌదరి అన్నారు. ఇప్పటికే తాము రోజూ 14-16 గంటలు పనిచేస్తున్నామని, తాము చేస్తున్న అదనపు పనికి ఎలాంటి చెల్లింపులు లభించటం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులపై ప్రభుత్వం పట్టింకుని అరికట్టకపోతే తమకు వారానికి 70 గంటలు పని సర్వసాధారణంగా మారే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications