IT News: భారతీయ టెక్కీలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగలు సైతం ముదిరిపోయారు. కరోనా కాలంలో ఇండియన్ టెక్ రంగంలో ఏర్పడిన బూమ్ కారణంగా చాలా మంది మంచి ఉద్యోగ అవకాశాలను పొందిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో చాలా మంది ఒకేసారి రెండు కంపెనీల్లో పనిచేయటం పెద్ద వివాదంగా మారిపోయింది. మూన్‌లైటింగ్ అంగీకరించేది లేదని కొన్ని కంపెనీలు చెప్పగా.. మరికొన్ని తమకు చెప్ప చేసుకుంటే ఓకే అంటూ ఉద్యోగులకు వెల్లడించాయి. కానీ ఆ తర్వాత పరిస్థితులు కుదుటపడ్డాయి. అయితే ప్రస్తుతం అమెరికాకు చెందిన ఒక యువ టెక్కీ చేసిన పని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

యూఎస్ కాలిఫోర్నియాకు చెందిన యువ టెక్ నిపుణుడు ఏకకాలంలో రహస్యంగా రెండు రిమోట్ ఉద్యోగాలను చేస్తూ రెండు చేతులా సంపాదించాడు. రెండు కంపెనీల నుంచి ఏడాదికి అక్షరాలా 3 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం రూ.2.50 కోట్లను సంపాదించాడు. తాను రెండేళ్లుగా ఇలా "డబుల్ డిప్పింగ్" చేస్తున్నానని చెప్పాడు. ఇంత భారీగా వేతనాన్ని పొందుతున్నప్పటికీ.. తన సంపాదనతో ఇంకా గొప్పగా భావించడం లేదని చెప్పాడు.
తాను సీక్రెట్ గా రెండు ఉద్యోగాలు చేయటాన్ని దాటి ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తాను పనిచేస్తున్న రెండు కంపెనీల్లో ఒక యజమానికి విషయం తెలిసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. వాస్తవానికి 2021లో సదరు టెక్కీని పాత బాస్ ఉద్యోగం కోసం వెతుకున్నావా అని అడగగా.. రెండు రిమోట్ జాబ్‌లు చేయడం గురించి ఆలోచించినట్లు పేర్కొన్నాడు.
తాను ఇల్లు కొనేందుకు, విహారయాత్రలకు, పదవీ విరమణ చేయాలనే లక్ష్యంతో నా రిటైర్‌మెంట్ ఖాతాలను పూరించానని తెలిపాడు. గత ఏడాది ఏక కాలంలో మూడు ఉద్యోగాలు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది తనకు సాధ్యం కాదని తెలుసుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు యువ టెక్కీ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications