IT News: TCS ఉద్యోగులకు గట్టి షాక్.. పలువురికి IT శాఖ నోటీసులు.. కంపెనీ తప్పిదమే కారణమా?
TCS News: దేశీయ టెక్ దిగ్గజం TCS ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ గట్టి షాక్ ఇచ్చింది. పలువురు IT విభాగం నుంచి పన్ను నోటీసులు అందుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS)కు సంబంధించి ఈ నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9న సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది వీటిని రిసీవ్ చేసుకున్నట్లు సమాచారం.
IT చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు పంపించింది. Q4 FY24కు గాను పూర్తి పన్ను మొత్తాన్ని కంపెనీ చెల్లించినట్లు ఎటువంటి రికార్డు లేదని అందులో పేర్కొంది. సమస్యకు కారణమైన నగదుతో పాటు దానిపై వడ్డీ మరియు పెనాల్టీలతో కలిపి చెల్లించాలని నోటీసులో స్పష్టం చేసింది. ఉద్యోగులు 50 వేల నుంచి 1.45 లక్షల మేరకు డిమాండ్ నోటీసులు అందుకున్నారు.

'ఇది సిస్టమ్ లోపం కావచ్చు. TDS క్లెయిమ్ స్వయంచాలకంగా పోర్టల్‌లో అప్‌డేట్ చేయబడదు. కాబట్టి మేము మాన్యువల్‌గా నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పుడు పన్నులో రికార్డ్ కాని భాగాన్ని చెల్లించాలని మాకు సమాచారం అందింది. దీని కారణంగా మా ఆదాయపు పన్ను రీఫండ్ మరింత ఆలస్యం అవుతుంది' అని TCS ఉద్యోగి ఒకరు తెలిపారు.
'ఆదాయపు పన్ను శాఖ జారీచేసిన 26AS.. కంపెనీ ఇచ్చిన ఫారమ్ 16లోని TDSతో అనుసంధానం అవుతుంది. అనంతరం అధికారులు IT రిటర్న్‌లను తిరిగి ప్రాసెస్ చేస్తారు. ఈ మేరకు నోటీసులు వచ్చిన ఉద్యోగులు నిర్ణీత సమయంలోగా సరిదిద్దిన సమాచారం అందుకుంటారు. డిమాండ్ పన్ను మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు' అని TCS తన ఉద్యోగులకు అంతర్గత ఇమెయిల్‌లో తెలిపింది.


Click it and Unblock the Notifications