Income Tax News: వేతన జీవులకు IT శాఖ SMSలు.. ఆందోళనకు గురవుతున్న ఉద్యోగులు..
SMS from IT: గత ఆర్థిక సంవత్సరం ముగిసి 4 రోజులు కావడంతో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే 20 వేలకు పైబడి రిటర్నులు దాఖలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో మూలం వద్ద మినహాయించిన మొత్తం పన్నుకు సంబంధించి కూడా మీడియా నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న కొందరు వేతన జీవులకు TDSకు సంబంధించి IT శాఖ SMS ద్వారా సందేశాలు పంపిస్తోంది. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంతో పాటు 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను యజమానుల ద్వారా డిడక్ట్ కాబడిన TDS గురించి ట్యాక్స్ పేయర్స్‌కు సమాచారం తెలియజేస్తోంది. మరిన్ని వివరాల కోసం వారి 26AS స్టేట్‌మెంట్‌ను చూడవలసిందిగా ఆదాయపు పన్ను శాఖ అందులో కోరింది.

ఈ సందేశం పన్ను చెల్లింపుదారులలో గందరగోళానికి దారితీసింది. కొంతమంది అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుందని భయపడుతున్నారు. అయితే ఈ SMS ట్యాక్స్ పేమెంట్ కోసం డిమాండ్ కాదని వేతన జీవులు గమనించాల్సి ఉంటుంది. ఇది కేవలం చివరి త్రైమాసికంలో మరియు గత ఆర్థిక ఏడాదిలో జమ చేసిన మొత్తం TDSకు రసీదుగా పనిచేస్తుంది.
SMS అలర్ట్ సర్వీస్ 2016 చివరలో ప్రవేశపెట్టబడింది. పన్ను చెల్లింపుదారులకు వారి మొత్తం TDS తగ్గింపుల గురించి తెలియజేయడమే దీని లక్ష్యం. ట్యాక్స్ బకాయిలు లేదా అదనపు తగ్గింపులపై దీనిద్వారా ఆదాయపు పన్ను శాఖ స్పష్టత అందిస్తుంది. జీతం పొందే వ్యక్తులు వారి శాలరీ స్లిప్‌లతో వివరాలను సరిచూసుకోవడానకి సహాయపడుతుంది.


Click it and Unblock the Notifications