IT notice: చాయ్‌వాలాకు చుక్కలు చూపించిన IT శాఖ.. పదేళ్ల క్రితం అలా చేసినందుకు..
Income Tax News: గతంలో చాలా మంది చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని భారీ స్థాయిలో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడేవారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆదాయపు పన్ను విభాగం కూడా రూటు మార్చింది. ఏ చిన్న ఆధారం దొరికినా నోటీసులు ఇచ్చేందుకు వెనకాడటం లేదు. అయితే ఈ తరహా దూకుడు ఒక్కోసారి సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది.
గుజరాత్‌లోని పటాన్‌కు చెందిన ఖేమ్‌రాజ్ దవే అనే చాయ్ వాలాకు ఆదాయపు పన్ను శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా 49 కోట్లు జరిమానా కట్టాలంటూ నోటీసు పంపించింది. దీంతో సదరు టీ విక్రేత ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఓ స్థానిక న్యాయవాదిని సంప్రదించి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకున్నాడు.

బాధితుడి కథనం ప్రకారం.. అల్పేష్ పటేల్, విపుల్ పటేల్ అనే ఇద్దరు వ్యక్తులు దవేకు దాదాపు పదేళ్లుగా పరిచయం. తన దుకాణంలోనే టీ తాగుతుంటారు. 2014లో పాన్ కార్డు పొందేందుకు, దాన్ని బ్యాంకు ఖాతాకు లింక్ చేసేందుకు అల్పేష్ నుంచి దవే సాయం కోరాడు. దాన్ని అవకాశంగా భావించిన అల్పేష్.. దవే నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు సంతకాలను సేకరించి వాటిని దుర్వినియోగం చేశాడు.
వారు దవే పేరిట యాక్టివేట్ చేసి అనధికార ఖాతా ద్వారా మొత్తం 34 కోట్లమేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. దీంతో దాదాపు పదేళ్ల తర్వాత ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపించింది. అల్పేష్ మరియు విపుల్‌లపై నమ్మక ద్రోహం, మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలపై ఫిర్యాదు నమోదైంది. వారిరువురినీ అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.


Click it and Unblock the Notifications