For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wipro Firing: 300 మందిని తొలగించిన విప్రో.. రెండు ఉద్యోగాలు చేస్తూ దొరికిన ఉద్యోగులు.. ఇతర కంపెనీల ప్లాన్..

|

Wipro Firing: ముందు నుంచి రెండు ఉద్యోగాలు వద్దని, అది అనైతికమంటూ విప్రో యాజమాన్యం వాధిస్తూనే ఉంది. దీనిపై రితీష్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ ఇది చీటింగ్ అని, ఉద్యోగి ఒకేసారి రెండు సంస్థలకు పనిచేయటం తగదని అన్నారు. అప్పటి నుంచి ఈ విషయంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కొంత మంది దీనిని వ్యతిరేకించారు కూడా. అయితే చివరికి మూన్‌లైటింగ్ విషయంలో విప్రో అన్నంత పనిచేసింది. అవును అసలేమైందో ఇప్పుడు తెలుసుకుందాం..

అడ్డంగా దొరికిపోయారు..

అడ్డంగా దొరికిపోయారు..

ప్రత్యర్థి కంపెనీ కోసం పనిచేయటం ఒక విధంగా సరైనది కాదు. ఒక వేళ అలా చేయాల్సి వస్తే.. దాని గురించి ముందుగానే యాజమాన్యాలకు తెలియజేయాలి. దీనిని ఎలాగైనా అరికట్టాలని విప్రో నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన కంపెనీకి ఇదే తప్పు చేస్తున్న 300 మంది ఉద్యోగులు అడ్డంగా దొరికిపోయారు.

కంపెనీ వివరణ ఇలా..

కంపెనీ వివరణ ఇలా..

ఇతర కంపెనీల్లో ఏకకాలంలో పనిచేస్తున్నట్లు గుర్తించబడిన 300 మందిపై కంపెనీ చర్యలు తీసుకుంది. వారిని ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి అందరికీ చమటలు పట్టిస్తోంది. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. ఇతర కంపెనీలు కూడా ఇదే చేస్తాయనే భయంలో ఇప్పుడు టెక్కీలు వణికిపోతున్నారు. కాంపిటీటర్ కంపెనీల కోసం విప్రో ఉద్యోగులు పనిచేయడం "act of integrity violation" కిందకి వస్తుందని ప్రేమ్‌జీ పేర్కొన్నారు.

ఇతర కంపెనీల పరిస్థితి..

ఇతర కంపెనీల పరిస్థితి..

మూన్‌లైటింగ్‌ మానుకోవాలని ఇన్ఫోసిస్ గతవారం ఉద్యోగులను హెచ్చరించింది. కేవలం విప్రో మాత్రమే కాకుండా TCS, InfoSys వంటి కంపెనీలు కూడా మూన్‌లైటింగ్‌కు వ్యతిరేకతను ఇప్పటికే వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 'మూన్‌లైటింగ్' అనేది సూటిగా బూటకమని, విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇతర కంపెనీల్లో పని చేయరాదని స్పష్టం చేశారు. ఇది సమగ్రతను పూర్తిగా ఉల్లంఘించడమేనని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ స్పష్టం చేశారు.

ఉద్యోగుల తొలగింపు ఇలా..

రిషద్ ప్రేమ్‌జీ నిర్ణయం కారణంగా ఏకంగా 300 మంది ఉద్యోగులు బాధను భరించాల్సి వచ్చింది. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తున్న ఈ విప్రో ఉద్యోగులందరిపై సత్వర చర్యలు తీసుకుని, వారి సేవలను రద్దు చేయడం ద్వారా కంపెనీ నుంచి వారు బయటకు వచ్చేందుకు మార్గం చూపామని విప్రో చైర్మన్ అన్నారు. గతంలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నిజరూపం దాల్చినట్లు కనిపిస్తోంది.

మూన్‌లైటింగ్‌ సబబేనంటున్న కంపెనీలు..

మూన్‌లైటింగ్‌ సబబేనంటున్న కంపెనీలు..

మూన్‌లైటింగ్ ను తాము అనుమతిస్తున్నట్లు దిగ్గజ డెలివరీ కంపెనీ స్విగ్గీ ప్రకటించింది. ఇందుబో భాగంగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అంటూ తన ఉద్యోగులకు వెసులుబాటును కూడా కల్పించింది. కంపెనీ ఉద్యోగులు పనివేళల తర్వాత ఇతర ప్రాజెక్టులకు కూడా పని చేయవచ్చని స్విగ్గీ పేర్కొంది. కంపెనీ ఉత్పాదకతను ప్రభావితం చేయకుండా మా ఉద్యోగులు కంపెనీ పని గంటల తర్వాత లేదా వారాంతాల్లో ఇతర ఉద్యోగాలు చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని కంపెనీ తెలిపింది.

English summary

Wipro Firing: 300 మందిని తొలగించిన విప్రో.. రెండు ఉద్యోగాలు చేస్తూ దొరికిన ఉద్యోగులు.. ఇతర కంపెనీల ప్లాన్.. | it company wipro fired 300 employeed who identified doing 2 jobs against moonlighting policy

it company wipro fired 300 employeed who identified doing 2 jobs against moonlighting policy
Story first published: Thursday, September 22, 2022, 7:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X