cognizant bonus letter: ఐటీ రంగంలో అగ్రగామి కొనసాకుతున్న సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు హోలీ కానుకగా గుడ్ న్యూస్ అందించింది. ఇప్పుడు అర్హత కలిగిన ఉద్యోగులకు ఎంప్లాయ్ బోనస్ లెటర్స్ జారీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఐటీ దిగ్గజం బోనస్ పేమెంట్లను 85% నుండి 115% మధ్య అందిస్తున్నట్లు ఓ వార్తా సంస్థ నివేదించింది. అలాగే ఈసారి చాలా మంది ఉద్యోగులు ఈ బోనస్లు అందుకోబోతున్నారని కూడా తెలిపింది, అయితే గత మూడు సంవత్సరాలలో చూస్తే అత్యధిక బోనస్ ఇవ్వడం కూడా ఇదే. సమాచారం ప్రకారం ఈ వారంలో బోనస్ పేమెంట్లకు సంబంధించి కంపెనీ ఇప్పటికే లెటర్స్ పంపడం ప్రారంభించింది. జీతాలతో పాటు మార్చి నుండి ఏప్రిల్ నెలల్లో ఈ బోనస్లు ఇవ్వనున్నారు.

జీతం పెంపుపై కూడా సమాచారం: ఈ బోనస్‌తో పాటు మెరిట్ పెంపు గత జీతాల పెంపు చేసిన ఒక సంవత్సరం తర్వాత నుండి అమలులోకి వస్తుందని కాగ్నిజెంట్ ఉద్యోగులకు తెలియజేసింది. గతంలో జీతాల పెంపుదలలో జాప్యం గురించి ఊహాగానాలను కంపెనీ తోసిపుచ్చింది. గతంలో కాగ్నిజెంట్ వివిధ ప్రదేశాలలో భారీగా నియామకాలు చేపడుతున్నట్లు తెలిపింది. మీరు అభివృద్ధి చెందుతున్న కంపెనీలో కొత్త అవకాశం కోసం చూస్తున్న టెక్ ప్రొఫెషనల్ అయితే, మీ కెరీర్‌లో మరో అడుగు వేయడానికి ఇప్పుడు సరైన అవకాశం కావచ్చు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ నుండి మౌలిక సదుపాయాల నిర్వహణ వరకు, కాగ్నిజెంట్ వివిధ టీంలలో చేరడానికి, కొత్త ప్రాజెక్టులపై పనిచేయడానికి ప్రతిభావంతులైన వారి కోసం వెతుకుతోంది.
జీతాల పెంపుకు సంబంధించిన లెటర్స్ జారీ చేసిన మరో కంపెనీ: గత నెలలో మరో ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల పర్ఫార్మెన్స్ ఆధారంగా జీతాల పెంపు లెటర్స్ అందించింది. అయితే కంపెనీ ఉద్యోగులను పర్ఫార్మెన్స్ లెవెల్స్ ప్రకారం క్యాటగిరి చేసింది. దింతో అంచనాలను అందుకున్న ఉద్యోగులకు 5-7% జీతాల పెంపు లభించగా, ప్రశంసించే పర్ఫార్మెన్స్ ఉన్నవారికి 7-10% పెంపు లభించింది. హై పర్ఫార్మెన్స్ కనబరిచిన ఉద్యోగులకి 10-20% పెరుగుదలను అందుకోగా, అయితే పర్ఫార్మెన్స్ మెరుగుపర్చుకోవాల్సిన క్యాటగిరిలోకి వచ్చే ఉద్యోగులకు ఎటువంటి జీతాల పెంపు లభించలేదు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం చాలా మంది ఉద్యోగులకు 5% నుండి 8% మధ్య పెంపుదల లభించింది, అయితే అత్యుత్తమ పర్ఫార్మెన్స్ కనబర్చిన వారికీ అత్యధిక పెంపు లభించింది.


Click it and Unblock the Notifications