IT News: ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల రంగంలో విస్తరించిన భారత టెక్ కంపెనీల పరిస్థితి అస్సలు బాగోలేదు. మెుదటి త్రైమాసిక ఫలితాలు వెలువడిన తర్వాత కంపెనీలు కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
దేశంలోని టాప్-5 ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టెక్ మహీంద్రా తాజాగా క్యూ1 ఫలితాలు ప్రకటించింది. ఫలితాలు దిగజారటంతో కంపెనీలోని ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో మాదిరిగానే టెక్ మహీంద్రా ఉద్యోగులకు జీతాల పెంపులను వాయిదా వేసింది. కంపెనీ ప్రకటన ప్రకారం కంపెనీలో పనిచేస్తున్న కొన్ని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు జీతాల పెంపు వాయిదా పడినట్లు తేలింది. టెక్ మహీంద్రా గత సంవత్సరం జూన్ త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 39 శాతం తక్కువ లాభాలను నమోదు చేసింది.

ఐటీ కంపెనీల్లో వ్యాపార మందగమనం ఉద్యోగులతో పాటు సీఈవోలను సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాధారణంగా ఏ కంపెనీలోని సీఈవోలు ఎక్కువ పారితోషికం పుచ్చుకుంటున్నారనే అంశం తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. టెక్కీలు వీటిని గమనిస్తుంటారు. విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే, ఇన్ఫోసిల్ సీఈవో సలీల్ పారిఖ్‌ల మధ్య గత కొన్నేళ్లుగా తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి కూడా ఇదే కొనసాగుతుందని భావించినప్పటికీ కథ మెుత్తం మారిపోయింది.
ఇదే క్రమంలో హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సి.విజయకుమార్ జీతం 80 శాతం తగ్గింది. విజయకుమార్ 2023 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.28.4 కోట్ల వేతనం పొందారు. దీనికి మునుపు ఏడాది ఆయన గరిష్ఠంగా రూ.130 కోట్లు జీతంగా అందుకున్నారు. దీంతో దేశంలోని ఐటీ సేవల కంపెనీల్లో అత్యధిక జీతం పొందిన సీఈవోగా రికార్డు నెలకొల్పారు. కానీ ప్రస్తుతం అతి తక్కువ వేతనం అందుకుంటున్న ఐటీ కంపెనీ సీఈవోగా నిలిచారు.
విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే రూ.82 కోట్ల జీతంతో 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వేతనం అందుకున్న ఐటీ సీఈవోల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో 56.4 కోట్ల రూపాయలతో ఇన్ఫోసిస్ సలీల్ పారిఖ్, 30.1 కోట్ల రూపాయలతో టెక్ మహీంద్రా సీఈవో సిబి కుర్నాని 3వ స్థానం, 29.16 కోట్ల రూపాయలతో టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథ్ 4వ స్థానం, 28.4 కోట్లతో హెచ్‌సిఎల్ టెక్ సీఈవో సి.విజయకుమార్ 5వ స్థానంలో నిలిచారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications