డిజిటల్ టెక్నాలజీ ట్రాన్సాక్షన్ కారణంగా ప్రస్తుత క్వార్టర్‌లో ఐటీ కంపెనీలు మెరుగైన ఆదాయాన్ని నమోదు చేయవచ్చు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం ఐటీ కంపెనీలు ఏడాది ప్రాతిపదికన రెండో క్వార్టర్‌లో ఆరోగ్యకర మెరుగుదలను సాధిస్తాయని అంచనా వేసింది. ప్రధానంగా గత ఒప్పంద విజయాలు, డిజిటల్ టెక్నాలజీలో ట్రాక్షన్, సప్లై వైపు ఒత్తిడి తగ్గుదల వంటివి ఇందుకు దోహదపడతాయని అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం టైర్ 1 ఐటీ కంపెనీలు స్థిరమైన కరెన్సీపరంగా 1 శాతం నుండి 3.5 శాతం పరిధిలో ఆదాయ వృద్ధిని చూడవచ్చు.

అందుకే మార్జిన్లు పెంచుతాయి
టైర్ 1 ఐటీ కంపెనీల్లో HCL టెక్, ఇన్ఫోసిస్ వరుసగా 4.8 శాతం, 4.7 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో వరుసగా 3.8 శాతం, 2.4 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చునని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వెల్లడించింది. వ్యాల్యూ పరంగా కంపెనీలకు డిమాండ్ ఉంది. లైఫ్ సైన్స్ అండ్ హెల్త్ కేర్, టెలికం అండ్ మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాలు ఆరోగ్యకరమైన ట్రాన్సాక్షన్స్ చూడనున్నాయి. ఐటీ కంపెనీల వ్యయ హేతుబద్దీకరణ, తక్కువ ప్రయాణ వ్యయం, క్రాస్ కరెన్సీ ప్రయోజనాలు, వినియోగం ఈ క్వార్టర్‌లో మార్జిన్లు పెంచుతాయని భావిస్తున్నారు.

టైర్ 2 కంపెనీల్లో...
టైర్ 2 ఐటీ కంపెనీల్లో కోఫోర్జ్ ఆదాయంలో డాలర్ పరంగా 7.4 శాతం వృద్ధి, మైండ్ ట్రీ 4 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాయి. ఆరోగ్యకర రాబడి, మార్జిన్ పెరుగుదల, సహేతుకమైన మదింపు వంటివి టెక్ మహీంద్ర ఫలితాలు సానుకూలంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. కోఫోర్జ్, టెక్ మహీంద్రా 150 నుండి 160bps మధ్య వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా. మైండ్ ట్రీ, ఎల్‌టీఐ వరుసగా 523bps, 238bps మెరుగుదల నమోదు చేస్తుందని అంచనా.

ఐటీ ఇండెక్స్ జూమ్
జూన్-సెప్టెంబర్ క్వార్టర్‌లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2,600bps భారీగా లాభపడింది. ఇటీవల ఐటీ స్టాక్స్ అదరగొడుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ఐటీ కంపెనీల వృద్ధి 1.8 శాతం నుండి 3.7 శాతం వరకు వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలలుగా అన్ని రంగాల కార్యకలాపాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇటీవలే క్రమంగా కోలుకుంటున్నాయి. అయితే ఐటీ రంగానికి మున్ముందు మంచి భావిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications