For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Investment: ఐటీ కంపెనీలో పెట్టుబడులకు రైట్ టైం వచ్చిందా..? ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలపై నిపుణుల సూచనలు..

|

Investment: మాంద్యం భయాలు ముదురుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. వరుస నష్టాలతో ఉత్తమ కంపెనీలు సైతం నష్టపోతున్నాయి. ప్రస్తుతం ఈ అవకాశాన్ని చాలా మంది ఇన్వెస్టర్లు తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో వేటిలో ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పడిపోతున్న షేర్ ధరలు..

పడిపోతున్న షేర్ ధరలు..

గత ఏడాది కాలంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో కంపెనీలు గత ఏడాది కాలంలో ఏకంగా 45 శాతం వరకు పడిపోయాయి. కంపెనీల ఆదాయ మార్జిన్లు పడిపోవటం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు దీని వెనుక ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇన్ఫోసిస్ 21.52 శాతం క్షీణించగా, విప్రో స్టాక్ 44.81 శాతం, TCS షేర్లు 22.51 శాతం తగ్గాయి.

గోల్డ్‌మన్ సాచ్స్ ఇలా..

గోల్డ్‌మన్ సాచ్స్ ఇలా..

ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ అండ్ రేటింగ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ దిగ్గజ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్‌, టీసీఎస్ షేర్లకు SELL రేటింగ్ అందించింది. అయితే విప్రోకు మాత్రం BUY రేటింగ్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అలుముకున్న సంభావ్య మందగమనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రేటింగ్ ఇచ్చినట్లు వెల్లడించింది. గోల్డ్‌మన్ సాచ్స్ ఈ ఏడాది సెప్టెంబర్ మధ్యలో టాప్ 5 భారతీయ కంపెనీలకు FY24E డాలర్ ఆదాయ వృద్ధి అంచనాను కూడా తగ్గించింది.

రీసెర్చ్ కంపెనీ అడ్వైజ్..

రీసెర్చ్ కంపెనీ అడ్వైజ్..

ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు ప్రస్తుత ధరల వద్ద కొనుగోలు చేసి హోల్డ్ చేయవచ్చని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో TCSకి ముఖ్యమైన మద్దతు స్థాయిగా రూ.2,900ని సూచించారు. ఇన్ఫోసిస్ టార్గెట్ ధర రూ.1,670, టీసీఎస్ టార్గెట్ ధర రూ.3,600 అని ఆషికా గ్రూప్ లీడ్ ఐటీ అనలిస్ట్ చిరాగ్ కచ్చడియా తెలిపారు. కష్టకాలంలో ఇన్ఫోసిస్, TCSలలో పెట్టుబడులు పెట్టటం కంపేరిటివ్ గా సురక్షితమైనదని వారు అంటున్నారు.

దీర్ఘకాలంలో ఇన్ఫోసిస్..

దీర్ఘకాలంలో ఇన్ఫోసిస్..

దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెడుతున్నట్లయితే Infosys స్టాక్ మంచి వాల్యూ పిక్‌ అని షేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ రీసెర్చ్ హెడ్ రవి సింగ్ తెలిపారు. విప్రో సమీప కాలంలో రూ. 380 - 400 స్థాయిల రేంజ్ బౌండ్ జోన్‌లో ట్రేడ్ కావచ్చని చెప్పారు.

Tips2trades..

Tips2trades..

పతనం సమయంలో ఇన్ఫోసిస్, విప్రో, TCS సహా భారతీయ IT స్టాక్స్ కనిష్ఠాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో Infosys & Wipro రెండూ సాంకేతికంగా ఎక్కువగా అమ్ముడవుతున్నాయని Tips2tradesకు చెందిన అభిజీత్ వెల్లడించారు. అయితే టీసీఎస్ కంపెనీ షేర్లు రానున్న రోజుల్లో 3,110-3,190 టార్కెట్ రీచ్ అవుతాయని అంచనా వేశారు. అయితే మెుత్తానికి మూడు కంపెనీలు ఐటీ రంగంలో దిగ్గజాలుగా కొనసాగుతున్నందున ఇన్వెస్టర్లు తమ రిస్క్ రిటర్న్ అంచనాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టటం ఉత్తమం.

English summary

Investment: ఐటీ కంపెనీలో పెట్టుబడులకు రైట్ టైం వచ్చిందా..? ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలపై నిపుణుల సూచనలు.. | it companies shares touched record lows experts say as right time to investment in tcs, infosys, wipro

it companies shares touched record lows experts say as right time to investment in tcs, infosys, wipro
Story first published: Wednesday, September 28, 2022, 11:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X