IT News: ఐటీ రంగంలో ఈ టెక్కీలకు మస్త్ డిమాండ్.. మ్యాటర్ లీక్ చేసిన టాప్ కంపెనీ సీఎమ్ఓ..
IT News: ఇటీవల ఐటీ సేవల రంగంలో కొత్త టెక్నాలజీలు, కొత్త ఆలోచనలు అంతా కొత్తకొత్తగా మారిపోతోంది. ఎంత గడ్డు పరిస్థితులు ఉన్నప్పటికీ భారత కంపెనీలు మాత్రం నెమ్మదిగా ముందుకు కొనసాగేందుకు ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాయి.
ఈ సమయంలో దేశీయ ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రాలో సీనియర్ అధికారి ఒకరు ఐటి ఉద్యోగులకు విశ్వాసం కలిగించే ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. దీంతో ఐటీ ఉద్యోగులంతా ఆత్మవిశ్వాసంతో కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి.. టెక్ మహీంద్రా కొత్త చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన పీయూష్ దూబే కీలక కామెంట్స్ చేశారు. భారతీయ ఐటీ సేవల పరిశ్రమలో ప్రస్తుతం సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు చాలా డిమాండ్ ఉందని చెప్పారు.

చాలా మంది మిడ్-సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేసి ఇతర కంపెనీల్లో చేరడంతో భారతీయ ఐటీ సర్వీస్ కంపెనీల్లో ఇటీవల ఖాళీలు భారీగా పెరిగాయి. సీనియర్ స్థాయిలోనే కాకుండా సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కూడా బర్న్‌అవుట్ అవకాశాలు అధికంగా ఉన్నాయని వెల్లడైంది. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కంపెనీలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించాయి. దీని కారణంగా ఉన్నత స్థాయి ఉద్యోగుల డిమాండ్ మరింతగా పెరుగుతోందని వెల్లడైంది.
ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీలు.. ముఖ్యంగా ఫార్మా, హెల్త్‌కేర్, రిటైల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఎక్కువ వినియోగదారులు, ఉద్యోగులు ఉండటంతో డిజిటల్ సేవలను ఎక్కువగా కోరుతున్నాయి. వీటి నిర్వహణకు మిడ్-సీనియర్ స్థాయి సిబ్బంది చాలా కీలకంగా మారుతున్నారు. అలాగే అన్ని రంగాలు ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తున్నందున వీటి నిర్వహణకు సైతం సీనియర్ లెవల్ టెక్ ఉద్యోగుల డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. మెుత్తానికి ఈ వార్త టెక్ ఉద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఫ్లెషర్స్ సైతం కొత్త్ ఉద్యోగాలపై కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications