IT News: అలాంటి ఉద్యోగులకు షాకిస్తున్న ఐటీ కంపెనీలు.. కొత్త ఆలోచనతో టెక్ కంపెనీల సేఫ్ గేమ్..!
IT News: ఇన్నాళ్లు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఉద్యోగాల్లో చేరిన వారిని సైతం చూసీచూడనట్లు వదిలేసిన కంపెనీలు ఇప్పుడు రూటు మార్చాయి. అయితే మందగమనం, మాంద్యం కారణంగా ఐటీ కంపెనీలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్న విషయం తెలిసిందే. అలా అనేక కంపెనీలు అవసరానికంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి కూడా.

పర్మినెంట్ ఉద్యోగులు..
ఇదిలావుండగా.. ఐటీ రంగంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు దాదాపు 20% తగ్గినట్లు ఒక అధ్యయనంలో తేలింది. ప్రస్తుత సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు తమ దృష్టిని తాత్కాలిక ఉద్యోగులపై కాకుండా శాశ్వత ఉద్యోగుల వైపు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల కంపెనీలకు సేఫ్ గేమ్ ఆడేందుకు అవకాశం లభిస్తుంది.

ప్రాజెక్టులను పెంచుకునేందుకు..
ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తగ్గుతున్న డిమాండ్ కు అనుగుణంగా పర్మినెంట్ ఉద్యోగులను కొనసాగిస్తూ.. కస్టమర్ల సంఖ్యను పెంచుకోవటానికి కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అడెక్కో తాజా అంచనాల ప్రకారం 8 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం కలిగిన ఐటీ ఉద్యోగులు కేవలం 10-12% మంది మాత్రమే మార్కెట్లో ఉన్నారు. పైగా రిక్రూట్‌మెంట్స్ సైతం భారీగా తగ్గాయి.

మెుదటి దశలో..
ప్రస్తుతం ఐటీ కంపెనీల ప్రాజెక్టులు తగ్గినందున మెుదటి దశలో కాంట్రాక్ట్ ఉద్యోగులను, బెంచ్ మీద ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి లేదా తగ్గస్తున్నాయి. పైగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రిక్రూట్ మెంట్స్ నిలిపివేశాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలకు ఉన్న బెస్ట్ ఆఫ్లన్లలో ఇది ఒకటి. పైగా కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులకు కంపెనీలు 60-70% వరకు జీతాలను పెంచాయి. అప్పట్లో ఉన్న డిమాండ్ అలాంటిది.

నైపుణ్యాలు ఉన్నా..
ఖర్చుల భారం, మార్జిన్ల తగ్గుదల దృష్ట్యా నైపుణ్యం ఉన్న ఉద్యోగులను నిలుపుకోవటం చాలా కష్టంగా మారింది. చాలా మంది అనేక కారణాల వల్ల ఈ మధ్య కాలంలో పనిచేస్తున్న కంపెనీలను వీడుతున్నాయి. దీని వల్ల అట్రిషన్ రేటు కంపెనీలకు అమాంతంగా పెరిగిపోయింది. అందుకే కంపెనీలు పర్మనెంట్ ఉద్యోగులపై ఇప్పుడు ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఐటీ రంగం మనదేశంలో ప్రస్తుతం దాదాపు 40% కాంట్రాక్ట్ ఉద్యోగులపైనే ఆధారపడి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వారికి చెల్లించే జీతాలు సైతం భారీగా తగ్గవచ్చని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications