IT Employees: ఒకపక్క ఐటీ కంపెనీలకు భారీగా ప్రాజెక్టులు వస్తుంటే.. ఉద్యోగులు కొరకరాని కొయ్యలుగా మారటం కంపెనీలకు ఇబ్బందులు కలిగిస్తోంది. భారతీయ ఐటీ కంపెనీల చేతిలో వచ్చే 5 ఏళ్లకు సరిపడా వ్యాపారం ఉంది. అయితే మాంద్యం భయాలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. ఉద్యోగుల తీరు అనేక కంపెనీలకు మాత్రం ఇబ్బందిగా మారింది.

సర్వేలో షాకింగ్ విషయాలు..
ఈ క్రమంలో కంపెనీలు ఐటీ ఉద్యోగులపై ఇంటి నుంచి పని, ఆఫీసు హాజరుకు సంబంధించి సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ సర్వేలో ఐటీ ఉద్యోగుల స్పందన ప్రముఖ ఐటీ కంపెనీలను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఐటీ రంగంలోని ఉద్యోగుల మధ్య సర్వే నిర్వహించింది. అయితే ఇందులో దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు వచ్చే 6 నెలల్లో కార్యాలయానికి రావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.

వారానికి 5 రోజులు..
ఒక్క శాతం కంటే తక్కువ మంది వారానికి 5 రోజుల పాటు ఆఫీసులకు రావాలని, కరోనా ముందులాగా పని చేయాలనుకుంటున్నట్లు తమ ప్రాధాన్యతను వ్యక్తం చేశారు. ఇది చిన్న, మధ్య తరహా ఐటీ సిబ్బందికి పెద్ద షాక్‌గా మారింది. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించడానికి చాలా కంపెనీలు సిద్ధమౌతున్నాయి.

రాజీనామాల భయం..
కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 42 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కట్ చేసి ఆఫీసుకు పిలిస్తే రాజీనామా చేస్తామని తెలిపారు. అలాంటి సందర్భం ఎదురైతే వేరే కంపెనీలకు మారేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

పార్ట్ టైమ్ ప్రీలాన్సింగ్ చేస్తూ..
IT, టెక్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో పార్ట్‌టైమ్ లేదా ఇతర కంపెనీలకు ఫ్రీలాన్సర్‌లుగా పని చేస్తున్నారు. దీని ద్వారా వారు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఆఫీసులకు తిరిగి వెళితే ఈ అవకాశం పోతుందని, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవటం కుదరదని వారు అంటున్నారు. ఈ అదనపు ప్రీలాన్సర్ ఉద్యోగాల గురించి ఐటీ కంపెనీలు కూడా తెలుసుకుంటున్నాయి.

హైబ్రిడ్ మోడల్ అనుసరిస్తే..
సర్వేలో పాల్గొన్న వారిలో ఒక్కశాతం కంటే తక్కువ మంది మాత్రమే వారానికి 5 రోజులు కార్యాలయానికి రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. 50 శాతం మంది మాత్రమే వారానికి 3 రోజుల పాటు ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మిగిలిన 49 శాతం మంది మాత్రం ఆఫీసులకు రాలేమని తేల్చి చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీలు చిన్న నగరాల్లో ఉద్యోగులకు దగ్గరగా తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications