IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
Huge Package: సాధారణంగా ప్రైవేట్ సెక్టార్ లోని ఇతర రంగాలతో పోలిస్తే IT ఉద్యోగుల జీతాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కొందరు అత్యాశకు పోయి నలుగురిలో నవ్వుల పాలవుతున్నారు. తాజాగా ఈ తరహా అభ్యర్థితో ఒక కంపెనీ CEOకు ఎదురైన అనుభవాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
వాన్‌శివ్ టెక్నాలజీస్ CEO గౌరవ్ ఖేటర్‌పాల్ తన కంపెనీ అవసరాలు అనుగుణంగా మంచి అభ్యర్థిని నియమించుకోవాలని భావించారు. ఆయనే ఓ వ్యక్తిని సెలెక్ట్ చేసి హైర్ చేసుకోవాలని HR విభాగానికి సూచించారు. అయితే వారు చెప్పింది విని CEOకు దిమ్మతిరిగినంత పని అయిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే X ప్లాట్ ఫారమ్‌లో షేర్ చేసుకున్నారు.

నాలుగేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థి ఏకంగా 45 లక్షల ప్యాకేజీని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి ప్రస్తుత ప్యాకేజ్ 28 లక్షలు అని దానికి మరో 17 లక్షలు జోడించి భారీ మొత్తంలో హైక్ అడుగుతున్నట్లు వెల్లడించారు. HR ద్వారా ఈ విషయం తెలుసుకుని మొదట షాక్ అయినా.. తేరుకుని ఆ అభ్యర్థిని హైర్ చేసుకునేందుకు లోన్ తీసుకుందామని చమత్కరించారు.
దీనిపై నెట్టింట వివిధ రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల అనుభవానికి అది చాలా పెద్ద మొత్తమని కొందరు వాదిస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం జీతం అనుభవం బట్టి కాదని, సామర్థ్యాన్ని బట్టి ఉంటుందని ఆ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. దీనిపైన గౌరవ్ సైతం స్పందించారు. దిగ్గజ ప్రోడక్ట్ కంపెనీలు వారిని భరించగలవేమో గానీ మాలాంటి చిన్న బూట్ స్ట్రాప్‌డ్ కన్సల్టింగ్ సేవలు కంపెనీలు ఆ స్థాయి వేతనాలు భరించలేవన్నారు.


Click it and Unblock the Notifications