వరంగల్, కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం..!
వరంగల్, కరీంనగర్ వాసులకు శుభవార్త. గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్న వరంగల్-జగిత్యాల జాతీయ రహదారిలోని హన్మకొండ-కరీంనగర్ రహదారి పనులు దాదాపు పూర్తి అయినట్లు అధికారులు చెబుతున్నారు. 68 కిలోమీటర్ల మేర ఉన్న ఈ హైవేపై ఈ నెల 5 నుంచి ట్రయల్ రన్ నిర్వహించేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు సిద్ధమయ్యారు. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ను హైవేపైకి మళ్లించడం ద్వారా ఎదురయ్యే ఇబ్బందులు తెలుసుకోనున్నారు. నిఘా కోసం ఒక కిలోమీటర్‌కు రెండు అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేశారు. హైవేపై 24 గంటలపాటు రియల్ టైం మానిటరింగ్ చేయనున్నారు. శంకరపట్నం మండలం కొత్తగట్టులో టోల్ ప్లాజాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను జగిత్యాల నుంచి ఖమ్మం వరకు నిర్మిస్తున్నారు. నేషనల్ హైవేను వరంగల్-జగిత్యాల మధ్య రెండు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. వరంగల్-కరీంనగర్ ప్యాకేజీ పనులు రూ.2486 కోట్లతో చేపట్టగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నిరంతర పర్యవేక్షణతో మూడేండ్లలోపే పనులు పూర్తి అయ్యాయి. హన్మకొండ నుంచి కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ వరకు రోడ్డు పూర్తయినా.. ప్రస్తుతానికి మానకొండూరు సమీపంలోని ఖాదర్‌గూడెం వరకు మాత్రమే రాకపోకలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. మానకొండూరు-దుర్శేడు మధ్య పెండింగ్ లో ఉన్న పనులు కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు ప్రకటించారు.

పనులన్నీ పూర్తయ్యాక త్వరలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవేను ప్రారంభించనున్నారు. ఈ హైవే నిర్మాణంతో కరీంనగర్-వరంగల్ నగరాల మధ్య ఐదు కిలోమీటర్ల దూరం తగ్గనుంది. గతంలో రెండు నగరాల మధ్య దూరం 72 కి.మీ. ఉండగా.. ఇప్పుడు 68 కి.మీ.కు తగ్గింది. గంటకు 100 కి.మీ.ల గరిష్ట వేగంతో వెళ్లేందుకు ఈ హైవేను వీలుగా నిర్మించడం వల్ల కారులో అయితే కేవలం 45 నిమిషాల నుంచి గంటలోపే కరీంనగర్ నుంచి వరంగల్ చేరుకునే అవకాశం ఉంది. రహదారిపై నీరు నిలవకుండా ఉండేందుకు ఎక్కడి నీరు అక్కడే భూగర్భంలోకి ఇంకేలా రహదారి వెంట భారీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు.
భారీ వర్షాలు కురిసినప్పుడు వరదంతా పొలాలను ముంచెత్తకుండా, రోడ్డు కోతకు గురికాకుండా రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలాంటి గుంతలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రాత్రి పూట అవతలి వైపు ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్ ఇవతలి వాహనాల మీద పడకుండా రోడ్డు మధ్యలో మీడియన్ చేస్తున్నట్లు వివరించారు. అక్టోబరు 1 నుంచి ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలకు టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే జగిత్యాల, కరీంనగర్ మధ్య ఇంకా పనులు ప్రారంభం కాలేదని తెలుస్తోంది. కరీంనగర్ జగిత్యాల రోడ్డు చిన్నదిగా ఉండడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications