Cheyutha Pensions: గుడ్ న్యూస్.. దసరాకు ముందే కొత్త పింఛన్లు..!

రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా కానుకగా చేయూత పథకం కింద చేయూత పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఇప్పటికే స్వీకరించారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు మాత్రం ప్రస్తుతం పింఛన్ మంజూరు చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. మొదటి దశలో కేవలం వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులతో పాటు ఫైలేరియా, డయాలసిస్‌ బాధితులకు మాత్రమే కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వీరి దరఖాస్తులను మాత్రమే ఆన్‌లైన్‌ చేయడంతో వాటిని మండలస్థాయి అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం విచారణను పూర్తి చేశారు. అధికారులు దరఖాస్తు దారుల ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి వివరాలన్నీ ఆన్ లైన్ నమోదు చేశారు. 33 జిల్లాల పరిధిలో మొత్తం 5,98,193 దరఖాస్తులు వచ్చాయి. కొత్త పింఛన్ల కోసం వచ్చిన అర్జీల్లో సగానికి పైగా వితంతువుల నుంచే వచ్చాయి. చాలా కాలంగా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో అర్హులైన మహిళలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో వితంతువుల వాటానే 55 శాతానికి పైగా ఉందని అధికారులు చెబుతున్నారు.

Pension

ఆ తర్వాతి స్థానంలో దివ్యాంగులు ఉన్నారు. మొత్తం 5,98,193 దరఖాస్తుల్లో వితంతువుల అర్జీలు 3,31,236 ఉండగా.. దివ్యాంగులు 1,48,882, ఒంటరి మహిళలు 62,689, గీత కార్మికులు 37,381, చేనేత కార్మికులు 18,005 మంది దరఖాస్తు చేసుకున్నారు. పింఛన్ల దరఖాస్తుల్లో హైదరాబాద్ జిల్లాను 46,540 అప్లికేషన్లు రాగా.. ములుగు జిల్లా కేవలం 4,818 దరఖాస్తులు వచ్చాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 38,293, నల్గొండ 32,993, మేడ్చల్ -మల్కాజిగిరి 32,968, ఖమ్మం 27,772 జిల్లాల నుంచి అప్లికేషన్లు వచ్చాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి పది వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి.

ఇప్పటికే అన్ని జిల్లాల్లో వెరిఫికేషన్ పూర్తి అయింది. ప్రభుత్వం దసరా పండుగ కానుకగా అర్హులైన పేదలకు నూతన పింఛన్లు అందించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో పూర్తి పారదర్శకతతో దరఖాస్తుల విచారణ పూర్తి చేసి, ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టి, భాసటగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పండుగ వెలుగుల్లో ప్రతీ పేద కుటుంబం సంతోషంగా ఉండాలనే సత్సంకల్పంతో ఈ పింఛన్ల ప్రక్రియను శరవేగంగా కొలిక్కి తెచ్చింది. దసరాకు ముందు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చూస్తోంది. అక్టోబర్ 10 నుంచి 18 మధ్య కొత్త పింఛన్ల మంజూరు చేసే అవకాశం ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+