Rice Price: గుడ్ న్యూస్.. తగ్గుముఖం పడుతున్న సన్న బియ్యం ధరలు..!

కొద్ది రోజుల క్రితం భారీగా పెరిగిన సన్న రకం బియ్యం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. అధికారులు తనిఖీలు చేయడంతో వ్యాపారులు బ్లాక్ చేసిన బియ్యాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. అంతే కాకుండా కొత్త పంట మార్కెట్లోకి రావడం, బియ్యం సరఫరా పెరగడం, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో బియ్యం ధరలు తగ్గుతున్నాయి. కొన్ని నెలల క్రితం వరకు మంచి రకం సన్న బియ్యం కిలో రూ.70 నుంచి రూ.80 ఉండేవి. జై శ్రీరాం బియ్యం అయితే కిలో రూ.75 నుంచి రూ.80 చేరింది. దీంతో ప్రజలు బియ్యం కొనుగోలు చేయలేక ఇబ్బంది పడ్డారు. బియ్యం, రైస్ మిల్లు వ్యాపారులు బియ్యం బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించారు.

ఎల్ నీనో వస్తుందని.. సన్న బియ్యం దొరకవని రేట్లు అమాంతం పెంచారు. తెలంగాణలో పండే నాణ్యమైన సన్న వడ్లకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా మారింది. ఇతర రాష్ట్రాల వ్యాపారులు పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయడంతో స్థానిక మార్కెట్లలో సరఫరా తగ్గింది. వాతావరణ పరిస్థితులు, మిల్లింగ్ ఖర్చులు, సరఫరాలో సమస్యలు కూడా బియ్యం ధరలపై ప్రభావం చూపాయని చెబుతున్నారు. భారీ ధరలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు రైస్ మిల్లుల్లో తనిఖీలు చేశారు. మరో పక్క వర్షకాలం భారీగా సన్నరకాలు సాగు చేశారు. ఈ పంట చేతికి వచ్చింది. దీంతో బియ్యం ధరలు క్రమంగా తగ్గుముఖ పట్టాయి.

Rice

అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు తెలంగాణవ్యాప్తంగా అధికారులు ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ సమయంలో మొత్తం 1,141 తనిఖీలు చేపట్టి 55 కేసులు నమోదు చేశారు. వీటిలో 35 క్రిమినల్ కేసులు ఉన్నాయి. తూకంలో మోసాలు చేయడం, పాత ధరల స్టిక్కర్లపై కొత్త ధరలు అంటించి విక్రయించడం వంటి అక్రమాలను అధికారులు గుర్తించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలతో పాటు కొత్త ధాన్యం మార్కెట్లోకి రావడం వల్ల బియ్యం సరఫరా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్ని రకాల బియ్యం ధరలు తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో బియ్యం రకాన్ని బట్టి ధరలు మారుతున్నాయి. బీపీటీ, కేఎన్ఎం రకాల బియ్యం కిలో రూ.60 నుంచి రూ.65 చేరాయి. తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రకాల ధర కిలోకు రూ.74 తగ్గింది.

హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రకాల బియ్యం కిలో రూ.79కు అమ్ముతున్నారు. అయితే ప్రాంతం, నాణ్యత, బ్రాండ్‌ను బట్టి ధరల్లో తేడాలు ఉంటాయని గమనించాలి. కాబట్టి కొనుగోలు చేసే ముందు స్థానిక దుకాణాల్లో ధరలు తెలుసుకోవడం మంచిది.కొత్త పంట మార్కెట్లోకి పూర్తిస్థాయిలో వస్తే బియ్యం సరఫరా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+