Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ శాశ్వతంగా వనే వే విధానం..!
హైదరాబాద్ మహానగరం రోజు రోజుకు విస్తరిస్తూనే ఉంది. అదే స్థాయిలో సిటీలో వాహనాలు పెరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ భారీగా పెరిగింది. ప్లై ఓవర్లు నిర్మించినా ట్రాఫిక్ తగ్గడం లేదు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఉంటుంది. కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రాన్స్ ఎన్టీఆర్ భవన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద పీక్ ఆవర్స్ లో 10 నుంచి 20 నిమిషాలు ఆగాల్సి వస్తుంది. ఇక వర్షం కురిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేబీఆర్ పార్క్ చుట్టూ ప్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కోసం రూ.10 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
ప్రభుత్వం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో పనులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే టెండర్లు దక్కించుకున్న కంపెనీలు పని ప్రారంభించాయి. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుకున్న విధంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధించారు. అయితే మొదటి వారం రోజులు వాహనదారులు ఇబ్బందులు పడినా తర్వాత అలవాటు పడిపోయారు. పార్క్ చుట్టూ 6 జంక్షన్లు ఉన్నాయి. మామూలుగా అయితే ఈ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఉండేది. అయితే పార్క్ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని క్లాక్‌వైజ్గా మళ్లించడంతో ఎక్కడా ట్రాఫిక్ లేకుండా వాహనాలు వెళ్తున్నాయి.

గతంలో వాహనదారులు ప్రతి జంక్షన్ వద్ద 5 నుంచి 10 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చేదని.. వనే వే వల్ల కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే వాహనాలు పార్క్ చుట్టూ తిరిగి రావొచ్చని అధికారులు చెబుతున్నారు. వనే వేను నెల రోజుల పాటు పరిశీలించిన తర్వాత దీన్ని శాశ్వతం చేయడం వల్ల ప్రాజెక్ట్ ఖర్చులు తగ్గొచ్చని భావిస్తున్నట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ ముందు నుంచి కేబీఆర్ పార్క్ జంక్షన్ వరకు ఉన్న మార్గంలో పిల్లర్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభించారు. జూబ్లీ చెక్‌పోస్ట్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పిల్లర్ల పునాదుల పనులు కూడా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
మహారాజ అగ్రసేన్ జంక్షన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలో అండర్ పాస్ నిర్మాణానికి పెద్ద ఎత్తున రోడ్డును తవ్వడం కూడా పూర్తయింది. వనే వే వల్ల ట్రాఫిక్ సింపుల్ గా వెళ్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ సందిగ్ధంలో పడింది. కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదిరిన తర్వాత ప్రాజెక్టును నిలిపేస్తే చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలు, ప్రజాధనాన్ని ఆదా చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని గుత్తేదార్లతో చర్చించి ఒక పరిష్కారానికి రావాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
