Zomato Lay Off's: ఉద్యోగులకు షాకిచ్చిన జొమాటో.. 250 మంది ఉద్యోగులు తొలగింపు..
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మూసివేతలో భాగంగా హైదరాబాద్ ఆఫీసులో పనిచేస్తున్న సుమారు 250 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. కేవలం ఖర్చులు తగ్గించుకోవడం కోసమే కాకుండా.. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ లేఆఫ్స్ చేపట్టినట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో సెంటర్‌ను మూసివేస్తున్నప్పటికీ.. జొమాటో తన ఇన్-హౌస్ కస్టమర్ సపోర్ట్ ఆపరేషన్స్‌ను పూర్తిగా ఆపలేదని జొమాటో ప్రకటించింది. వీటిని హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న తన హెడ్ ఆఫీసుకు మారుస్తున్నట్లు ప్రకటించింది.
ప్రొడక్ట్, టెక్నాలజీ, అనలిటిక్స్ వంటి కీలక విభాగాలకు కస్టమర్ సపోర్ట్ టీమ్ లను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జొమాటో కంపెనీ ప్రకటించింది. గత 6 నెలలుగా కస్టమర్ కేర్ బాధ్యతలను బయటి సంస్థలకు అవుట్‌సోర్సింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో ఫుడ్ డెలవరీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఉద్యోగం కోల్పోతున్న సిబ్బందికి జొమాటో తగిన భద్రత కల్పిస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగులకు ఆగస్ట్ నెల పూర్తి జీతంతో పాటు.. కాంట్రాక్ట్ నోటీస్ పే, ఒకేసారి చెల్లించే ఎక్స్-గ్రేషియా కలిపి మొత్తం 4 నెలల వేతనాన్ని సెవెరెన్స్ ప్యాకేజీ కింద చెల్లిస్తున్నట్లు సమాచారం.

అంతేకాకుండా ఉద్యోగం నుంచి రిలీజైన తర్వాత కూడా మార్చి 31, 2027 వరకు మెడికల్ ఇన్సూరెన్స్, కౌన్సెలింగ్ సపోర్ట్ కొనసాగించుకునే వెసులుబాటు జొమాటో కల్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీలు కస్టమర్ సపోర్ట్ కోసం భారీ ఇన్-హౌస్ టీమ్‌లను ఉంచుకోవడానికి బదులుగా ఏఐ, ఆటోమేషన్, థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే ట్రెండ్ కొనసాగుతుండటంతో కస్టమర్ కేర్ ఉద్యోగులపై వేటు పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ 2025లోనూ జొమాటో సుమారు 500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించింది.
ఈసారి హైదరాబాద్ సెంటర్ మూసివేతతో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్ కు తెర లేపింది. ఈ లే ఆఫ్స్ తో దాదాపు 250 మంది ఉపాధి కోల్పోనున్నట్లు తెలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications