AP News: ప్రజలకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే కందిపప్పు, వంట నూనె..!
అధిక ధరలతో బాధపడుతున్న పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. రాష్ట్రంలో ఇప్పటికే సబ్సిడీపై సన్న బియ్యాన్ని అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రైతు బజార్ల ద్వారా కందిపప్పు, వంట నూనెలు తక్కువ ధరకు సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే పేదలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తున్న మనోహర్.. తమ ప్రభుత్వం, ఇప్పుడు మరిన్ని నిత్యవసర వస్తువులను కూడా మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
బహిరంగ మార్కెట్ లో సన్న బియ్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రభుత్వం దానిపై సమీక్ష నిర్వహించింది. తక్కువ ధరకే క్వాలిటీ బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి నేపథ్యంలో తక్కువ ధరకే సన్న బియ్యం అందుబాటులోకి తెచ్చామని మంత్రి పేర్కొన్నారు. బిపిటి స్టీమ్డ్ రైస్ 52 రూపాయలకు, బిపిటి రా బియ్యం కిలో 50 రూపాయలకు ప్రజలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్ లెట్ల ద్వారా ఈ సేవలు కొనసాగుతున్నాయని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలోనే కందిపప్పు, పామాయిల్ వంటి వాటిని కూడా తక్కువ ధరకు పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ పైన నిరంతరం దృష్టి సారిస్తున్న ప్రభుత్వం, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడం కోసం చర్యలు తీసుకుంటుందని వివరించారు. సామాన్యులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అయితే కిలో కంది పప్పు ధర ఎంత, పామాయిల్ లీటర్ ఎంతకు అమ్ముతారో ఇంకా ప్రకటించ లేదు.
కంది పప్పుతో పాటు పెసర పప్పు, మినుములు, చక్కెర కూడా సబ్సిడీపై అందించాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని గుర్తు చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications