Bengaluru News: బెంగళూరులో భారీగా పెరుగుతున్న అద్దెలు.. దేశంలోనే ఇక్కడే ఎక్కువ..!
బెంగళూరు మహానగరంలో అద్దెలు భారీగా పెరుగుతోన్నాయి. ఇందుకు సంబంధించి అనారాక్ ఒక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం బెంగళూరులో రెంటల్ ఇల్డ్ 4.6 శాతంగా ఉంది. అంటే ఇక్కడే దేశంలో అత్యధిక రెంటల్ ఇల్డ్ వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బెంగళూరులో అద్దెలు ఏ స్థాయిలో పెరిగాయో. అంతేకాకుండా సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో మూడు నెల నుంచి ఆరు నెలల అద్దె కూడా తీసుకుంటున్నారు. అందుకే బెంగళూరులో ఉద్యోగం వచ్చినా కొంత మంది వెళ్లలేకపోతున్నారు.
మిగతా నగరాల్లో రెంటల్ ఇల్డ్ పరిశీలిస్తే.. ముంబైలో 4.3 శాతం, గురుగ్రామ్ లో 4.3 శాతం, పూణేలో 3.95 శాతం, నోయిడాలో 3.9 శాతం, కోల్ కత్తాలో 3.9 శాతం, హైదరాబాద్ లో 3.6 శాతం, నవీ ముంబైలో 3.6 శాతం, థానేలో 3.5 శాతం, చెన్నైలో 3.25 శాతం, ఢిల్లీలో 3.2 శాతంగా ఉంది. 2019 నుంచి 2026 మధ్య నోయిడాలో ఆస్తి ధరలు 111 శాతం పెరిగాయి. ధరలు 2019లో చదరపు అడుగుకు సుమారు రూ. 4,795 నుంచి 2026 నాటికి రూ. 10,780కి పెరిగాయి.

బెంగళూరు, గురుగ్రామ్‌లతో పోలిస్తే ఇక్కడ ధర వేగంగా పెరిగింది. ఈ నగరంలో మౌలిక సదుపాయాల కల్పన నిలకడగా జరిగింది. రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు మెరుగుపడ్డాయి. మెట్రో కనెక్టివిటీ విస్తరించింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం కూడా అద్దెల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.
బెంగళూరు భారతదేశంలోని అతిపెద్ద టెక్నాలజీ, ఉపాధి కేంద్రాలలో ఒకటిగా ఉంది. ఇక్కడ ఇళ్ల మార్కెట్ కూడా బలమైన వృద్ధిని సాధించింది. అద్దెలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఇల్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
2020 నుంచి 2025 మధ్య బెంగళూరులో ఆస్తి ధరలు 66 శాతం పెరిగాయి. నోయిడాలో ఈ పెరుగుదల 111 శాతంగా ఉంది. గురుగ్రామ్‌లో 86 శాతం పెరుగుదల నమోదైంది. అయితే బెంగళూరులో 2020 నాటికి ఆస్తి ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఆస్తుల ధరలు తక్కువగా పెరిగినట్లు కనిపిస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications