Brain chip: విభిన్న ప్రయోగాలు చేయడంలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ముందు వరుసలో ఉంటారు. న్యూరాలింక్ ద్వారా మానవ మనుగడలో ఓ కొత్త శకాన్ని నమోదు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏళ్ల తరబడి పరిశోధనల అనంతరం ఎట్టకేలకు మానవుడి మెదడులో చిప్‌ను ఇన్‌స్టాల్ చేశారు.
మనిషి పుర్రెలో న్యూరాలింక్ ఇంప్లాంట్ చేసిన మొదటి చిప్ ను వేరుచేసే క్రమంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు ఎలాన్ మస్క్ కంపెనీ తెలిపింది. ప్రయోగ బాధితుడు నోలాండ్ అర్బాగ్ తన మెదడుకు న్యూరాలింక్ చిప్‌ను అమర్చడానికి ఫిబ్రవరిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే సూక్ష్మ కంప్యూటర్‌ను మెదడుకు కనెక్ట్ చేసిన పరికరం తన థ్రెడ్‌లను ఉపసంహరించుకోవడం ప్రారంభించడంతో ఇంప్లాంట్ జరిగిన నెలలోపే పరికరం పనితీరు మందగించినట్లు సమాచారం.

నోలాండ్ అర్బాగ్ మెదడు నుంచి ఆ పరికరం పాక్షికంగా ఎందుకు ఉపసంహరించబడిందో న్యూరాలింక్ వెల్లడించలేదు. అయితే దాని ఇంజనీర్లు ఇంప్లాంట్‌ను మెరుగుపరిచారని, రోగి కార్యాచరణను పునరుద్ధరించారని కంపెనీ పేర్కొంది. నోలాండ్ తన మెదడు ఆలోచనలను ఉపయోగించి కంప్యూటర్‌లో చదరంగం ఆడగలడు కాబట్టి సామర్థ్యాలు తగ్గడం ప్రమాదం కలిగించేలా కనిపించడం లేదని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంప్లాంట్‌ను తొలగించే అవకాశాన్ని నిపుణులు పరిగణించినట్లు మీడియా సంస్థ పేర్కొంది. మార్చిలో ఈ ఇంప్లాంట్‌ను ప్రశంసించిన నోలన్.. ఇది అతని జీవితాన్ని మార్చేసినట్లు చెప్పారు. ప్రక్రియ పరిపూర్ణంగా లేకపోవడంతో వారు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారని వెల్లడించారు.
కంపెనీ తన మొదటి మానవ ఇంప్లాంట్‌ను నిర్వహించడానికి ముందు గొర్రెలు, పందులు, కోతులు సహా పలు జంతువులపై ఏళ్ల తరబడి విస్తృతంగా ప్రయోగాలు చేసింది. రెగ్యులేటర్లు కూడా ఆ ల్యాబ్‌లలో పరీక్షా పద్ధతులను పరిశీలించారు. అయితే కాలిఫోర్నియాలోన ఓ పరిశోధనా కేంద్రంలో నాణ్యత, నియంత్రణ మరియు రికార్డ్ కీపింగ్ సమస్యలను కనుగొన్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications