రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కేంద్రానికి ఇవ్వవలసిన మధ్యంతర డివిడెండ్ అంశంపై వచ్చే బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్థిక మందగమనం, రెవెన్యూ వసూళ్లు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో కేంద్రం ద్రవ్యలోటును పూడ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్బీఐ నుంచి కేంద్రం మధ్యంతర డివిడెండ్ కోరింది. దీనిపై ఆర్బీఐ తదుపరి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది.

ఆర్బీఐ డివిడెండ్ కీలకం
ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం చివరలో నిర్వహించే RBI సెంట్రల్ బోర్డు సమావేశంలో ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు మధ్యంతర డివిడెండ్ అంశాన్ని లేవనెత్తే అవకాశాలు ఉంటాయి. డివిడెండ్‌కు ప్రభుత్వం అంగీకరిస్తే మోడీ ప్రభుత్వానికి ఇది ఊరట కలిగించే అంశమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీలో 3.3 శాతం దాటకుండా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రెవెన్యూ కలెక్షన్లు తగ్గడంతో పాుట వృద్ధి రేటు అంచనా ఈ ఏడాది 5 శాతంగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ డివిడెండ్ కీలకం.

ఈ ఆదాయం డివిడెండ్‌గా...
ఆర్బీఐకి కరెన్సీ ట్రేడింగ్, ప్రభుత్వ బాండ్స్ ద్వారా ఆదాయం వస్తుంది. ఇందులో కొంత ఆర్బీఐ నిర్వహణ కోసం, మిగతా మొత్తాన్ని డివిడెండ్ పేరుతో ప్రభుత్వానికి బదలీ చేస్తుంది. గత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ రూ.28,000 డివిడెండ్ ఇచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో మధ్యంతర డివిడెండ్‌గా రూ.10,000 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చింది.

రూ.1,76,051 కోట్లు ట్రాన్సుపర్‌కు ఆమోదం
గత ఏడాది ఆగస్ట్ నెలలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆర్బీఐ రూ.1,76,051 కోట్లు ప్రభుత్వానికి బదలీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో 2018-19 మిగులు రూ.1,23,414 కోట్లు ఉన్నాయి. మిగతా రూ.52,637 కోట్లు ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్ (ఈసీఎఫ్) సవరణలతో గుర్తించిన మిగులు.

అంచనాలకు మించి డివిడెండ్
వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు మించి ఏకంగా రూ.94,515 కోట్ల డివిడెండ్ లభించింది. ప్రభుత్వం రూ.90వేల కోట్లు అంచనా వేసింది.


Click it and Unblock the Notifications