Ananth Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ముఖేష్ అంబానీ తీసుకునే నిర్ణయాలకు ఎదురుండదని తెలిసిందే. కానీ తన చిన్న కుమారుడి విషయంలో ఎదురుదెబ్బ తగులుతున్నట్లు తెలుస్తోంది.
అవును రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో అనంత్ అంబానీ నియామకంపై వివాదం ముదురుతోంది. వాస్తవానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో అనంత్ అంబానీ నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని అంతర్జాతీయ ప్రాక్సీ సలహా సంస్థ ఇనిస్టిట్యూషనల్ షేర్‌హోల్డర్ సర్వీసెస్ ఇంక్.. వాటాదారులకు సూచించింది. మార్కెట్ విలువ ప్రకారం భారతదేశపు అతిపెద్ద కంపెనీకి 28 ఏళ్ల అనంత్ అంబానీని వారసుడిగా ప్రవేశపెట్టే ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.

అనంత్ అంబానీకి నాయకత్వం, బోర్డుకు సంబంధించిన వ్యవహారాల్లో అనుభవం తక్కువగా ఉండటంపై అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందువల్ల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు అవసరం. దీని కారణంగా బోర్డులో అతని సహకారంపై ఆందోళనలు పెరిగాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో అనంత్ అంబానీ అన్నయ్య ఆకాష్, సోదరి ఇషా అంబానీల నియామకానికి ఇన్స్టిట్యూషనల్ షేర్ హోల్డర్ సర్వీసెస్ మద్దతు ఇచ్చింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌పై రిలయన్స్ నుండి అధికారిక స్పందన లేదు.
మరో అంతర్జాతీయ ప్రాక్సీ సంస్థ గ్లాస్ లూయిస్ అనంత్ అంబానీ నియామకానికి అనుకూలంగా ఉంది. "అనుభవం ఆధారంగా మేము అనంత్ అంబానీని ఆకాష్, ఇషాల నుంచి వేరు చేయము," అని గ్లాస్ లూయిస్ డెక్కీ విండర్టో చెప్పారు. అయితే ఈ వివాధానికి ముఖేష్ ఎలా చెక్ పెడతారో చూడాల్సి ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications