bengaluru traffic: స్పేస్ ట్రావెల్ కంటే ఇదే కష్టంగా ఉంది! బెంగళూరు ట్రాఫిక్ పై ఆస్ట్రోనాట్ శుక్లా జోకులు!

బెంగళూరు నగరంలో ప్రయాణించడం ఎంత కష్టమో వివరిస్తూ భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా కొన్ని జోకులు పేల్చారు. గురువారం జరిగిన బెంగళూరు టెక్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ స్పేస్ ట్రావెల్ చేయడం కంటే బెంగళూరు ట్రాఫిక్ లో ప్రయాణించడం కష్టంగా ఉందని చమత్కరిస్తూ.. ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు.

ట్రాఫిక్‌పై పంచులు

ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా.. తాను మారతహళ్లి నుంచి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్(తుంకూరు రోడ్) వరకు ప్రయాణించడానికి పట్టిన సమయం తాను ప్రసంగించబోయే సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ అని చమత్కరించారు.

ఎవరీ శుక్లా?

శుక్లా కేవలం ఒక ఆస్ట్రోనాట్ మాత్రమే కాదు. ఆయన జూలైలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో అడుగుపెట్టిన మొదటి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. 41 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడు (రాకేష్ శర్మ తర్వాత) కూడా ఆయనే.

isro scientist bengaluru traffic joke

మంత్రి ప్రియాంక్ ఖర్గే రియాక్షన్

శుక్లా చమత్కారానికి కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తమ ముగింపు ప్రసంగంలో స్పందించారు. "శుభాన్షు శుక్లా అంతరిక్షం నుంచి బెంగళూరు చేరుకోవడం తేలికైంది కానీ, మారతహళ్లి నుంచి ఈ వేదికకు రావడం కష్టమని అన్నారు" ఇలాంటివి మళ్లీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఖర్గే హామీ ఇచ్చారు.
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్ వివాదం నేపథ్యంలో శుక్లా చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది.

బెంగళూరులో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు

  • బెంగళూరులో రోజురోజుకీ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. ఇక్కడ రోజువారీ సగటు ట్రాఫిక్ రద్దీ పొడవు 189.6 కిలోమీటర్లుగా ఉంది. సగటు వన్-వే ప్రయాణ సమయం కేవలం ఒక సంవత్సరంలో 16 శాతం పెరిగింది. రద్దీ సమయాల్లో ప్రజలు సంవత్సరానికి సుమారు 117 గంటల సమయాన్ని ట్రాఫిక్‌లో కోల్పోతున్నారు.
  • 2025 మొదటి ఆరు నెలల్లో బెంగళూరు రోడ్లపై మూడు లక్షల కంటే ఎక్కువ కొత్త ప్రైవేట్ వాహనాలు చేరాయి. కేవలం జూన్‌లోనే 49,620 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ప్రస్తుతం నగరంలో వాహన సాంద్రత ప్రతి కిలోమీటరుకు 823 వాహనాలుగా ఉంది. ఇదేధోరణి కొనసాగితే 2026 మధ్య నాటికి మరో ఐదు లక్షల ప్రైవేట్ వాహనాలు రోడ్లపైకి వస్తాయని రవాణా శాఖ తెలిపింది.

టన్నెల్ రోడ్డు ప్రాజెక్ట్

బెంగళూరు ట్రాఫిక్(bengaluru traffic) కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం రూ.17,800 కోట్లతో టన్నెల్ రూట్స్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తోంది. అయితే దీనిపై పర్యావరణం పరంగా కొన్ని ఇబ్బందులు ఉండడంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉంది. ఈ టన్నెల్ రూట్స్ వల్ల భూగర్భ నీటి నిల్వలు పాడవుతాయని పర్యావరణ వేత్తలు అంటున్నారు. మరీ ఈ ప్రాజెక్ట్ ఏమవుతుందో? బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు ఎలా తీరతాయో ముందు ముందు వేచి చూడాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+