ISRO News: అమెజాన్‌తో ఇస్రో డీల్.. ఖర్చు తగ్గించుకునేందుకు కిల్లర్ ప్లాన్!
ISRO News: అంతరిక్ష రంగంలో భారత్ ముందుకు వెళుతున్న తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. అందుబాటులో ఉన్న వనరులను చక్కగా వినియోగించుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. తన భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం పలు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
అంతర్జాతీయ స్పేస్ రేసులో పలు కొత్త ఆవిష్కరణలకు క్లౌడ్ కంప్యూటింగ్ సేవల కోసం భారత ఏజెన్సీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరియు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe)తో జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలిపింది.

ఇస్రోతో కుదిరిన ఈ ఒప్పందం కారణంగా అంతరిక్ష రంగం అభివృద్ధి వేగవంతం అవుతుందని భావిస్తున్నట్లు అమెజాన్ క్లౌడ్ చెప్పింది. దీనివల్ల స్పేస్ స్టార్టప్‌లు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు విద్యార్థులకు తమ అత్యాధునిక క్లౌడ్ టెక్నాలజీల యాక్సెస్ లభిస్తుందని వెల్లడించింది.
అత్యంత తక్కువ బడ్జెట్ తోనే చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్, ఆదిత్య L-1 మిషన్లను ఇస్రో ప్రయోగించింది. ఇప్పుడు AWSతో కుదిరిన ఒప్పందం వల్ల మరింత తక్కువ ఖర్చుతో క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా అర్థవంతమైన ఫలితాలను సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి అనలిటిక్స్ తో పాటు పెద్ద మొత్తంలో ముడి స్పేస్ డేటా నిర్వహణ సులభతరమవుతుంది.


Click it and Unblock the Notifications