ఇస్రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్: సంప్రదాయానికి పూర్తి భిన్నంగా: స్వరూపం మారుతోందా?
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. ఓ సరికొత్త ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇప్పటిదాకా రాకెట్లు, శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించడానికే పరిమితమౌతూ వచ్చిన ఆ సంస్థ కమర్షియల్ బాట పట్టినట్టు కనిపిస్తోంది. ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. మ్యాప మై ఇండియాతో కలిసి ఓ జాయింట్ వెంచర్‌ను ప్రారంభించింది. మ్యాపింగ్ పోర్టల్, జియోస్పేసియల్ సర్వీసుల కోసం ఓ సమగ్ర నేవిగేషనల్ మ్యాప్‌ను అందుబాటులోకి తీసుకుని రానుంది.
మ్యాప్ మై ఇండియాకు చెందిన డిజిటల్ మ్యాప్స్, ఇస్రో శాటిలైట్ ఇమేజినరీ ఎర్త్ అబ్జర్వేషన్ డేటా సహకారంతో దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు మ్యాప్ మై ఇండియా ముఖ్యకార్యనిర్వహణాధికారి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహన్ వర్మ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తాము దీన్ని చేపట్టబోతోన్నామని పేర్కొన్నారు. మ్యాపులు, నేవిగేషన్ వంటి ఇతర జియోస్పేసియల్ సర్వీసుల కోసం విదేశీ కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం ఇకపై రాబోదని చెప్పారు. అలాంటి సేవలకు మేడిన్ ఇండియా దోహదపడుతుందని చెప్పారు.

ఈ సమాచారాన్ని ఇస్రో ధృవీకరించింది. మ్యాప్ మై ఇండియాతో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. మ్యాప్ మై ఇండియా సొంత సంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. ఇదివరకే ఇస్రో సొంతంగా నేవిగేషన్ సిస్టమ్ నేవిక్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. నేవిక్ పేరుతో వెబ్ సర్వీసులు, అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ వ్యవస్థను చేపట్టింది.
తాజాగా మ్యాప్ మై ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం.. భువన్, వేదాస్, మోస్డాక్ పేర్లతో జియో పోర్టల్ సర్వీసులను అందుబాటులోకి తీసకుని రానుంది. స్వదేశీ మ్యాపింగ్ పోర్టల్ రూపకల్పన, భౌగోళిక సమాచార సేకరణ, ఇతర సేవల కోసం సొంతంగా మ్యాప్/ఎర్త్ అందుబాటులోకి వస్తాయని రోహన్ వర్మ తెలిపారు. భవిష్యత్తులో నేవిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్/గూగుల్ ఎర్త్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications